మా ఊరి పొలిమేరకు సీక్వెల్.. బాలాదిత్య హీరోగా దర్శకుడు ఎవరంటే?
కంటెంట్ ప్రధానంగా వచ్చే చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది. కథా, కథనాలు బాగుంటే అది ఏ భాష సినిమా అనే విషయాన్ని పట్టించుకోకుండా సినిమాను హిట్ చేసే పరిస్థితి కనిపిస్తున్నది. ఇటీవల కాలంలో కంతారా, రైటర్ పద్మభూషణ్ లాంటి సినిమాలను ప్రేక్షకులను బ్రహ్మండంగా ఆదరించారు. నేటివిటీ ప్రధానంగా వచ్చే చిత్రాలు చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడాను కూడా చూడకుండా ఆదరిస్తున్నారు. ఇలాంటి కోవలోనే నేటివిటి ప్రధానంగా వచ్చిన చిత్రం మా ఊరి పొలిమేర. 2021లో వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్‌గా మళ్లీ మంచి కథ, కథనాలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా వివరాల్లోకి వెళితే..
శ్రీ కృష్ణ క్రియేషన్స్ బేనర్‌పై గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మాతగా మా ఊరి పొలిమేర సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్నది. సత్యం రాజేశ్, డాక్టర్ కామాక్షి భాస్కరాల, గెటప్ శ్రీను, బాలాదిత్య, రవి వర్మ, చిత్రం శ్రీను, ఆక్షత శ్రీనివాస్ తదితరులు నటిస్తున్నారు. డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. సత్యం రాజేష్, డా కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య, రవివర్మ, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఉత్తరాఖండ్, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఖమ్మం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నది.

ప్రస్తుతం మా ఊరిపొలిమేర చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
నటీనటులు: సత్యం రాజేశ్, డాక్టర్ కామాక్షి భాస్కరాల, గెటప్ శ్రీను, బాలాదిత్య, రవి వర్మ, చిత్రం శ్రీను, ఆక్షత శ్రీనివాస్
సంగీతం: గ్యాని
సినిమాటోగ్రఫి: ఖుషేందర్ రమేష్ రెడ్డి
పీఆర్వో: వంగాల కుమారస్వామి
ఆర్ట్ డైరెక్టర్: ఉపేంద్ర రెడ్డి చందా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్సీ సతీష్ కుమార్
నిర్మాత: గౌరి కృష్ణ
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: డాక్టర్ అనిల్ విశ్వనాథ్


Click it and Unblock the Notifications











