అల్లు అర్జున్ ‘పుష్ప 2’ ఎఫెక్ట్.. మంచు విష్ణు అలెర్ట్..

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. హీరో అల్లు అర్జున్ కు సినిమా ఇండస్ట్రీ అండగా నిలిచింది. అయితే ఇండస్ట్రీ వ్యవహార తీరును రేవంత్ సర్కార్ తప్పు పట్టింది. ఇకపై తెలంగాణలో ఏ సినిమాకు కూడా ప్రీమియర్ షోలు ఉండవని,టికెట్ రేట్లకు అనుమతించబోమంటూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సంచలన నిర్ణయంతో ఇండస్ట్రీ మొత్తం అయోమయ పరిస్థితిలో పడింది. ఈ నేపథ్యంలో 'మా' ప్రెసిడెంట్ మంచు విష్ణు అలెర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఓ అధికారిక ప్రకటన ద్వారా 'మా' సభ్యులకు కీలక సూచనలు చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

గత పది,పదిహేను రోజులుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో పలు విషయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్‌పై కేసు వ్యవహారాన్ని కేవలం స్టేట్ మీడియానే కాకుండా నేషనల్ మీడియా సైతం కవర్ చేస్తుంది. ఈ వ్యవహారంపై పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ తరచూ వార్తలలో నిలుస్తున్నారు. ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే టాలీవుడ్ తెలంగాణ నుండి ఆంధ్రాకు తరలిపోతుందంటూ పలువురు శని ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. కొంతమంది అల్లు అర్జున్ కు అండగా నిలిస్తే మరి కొంతమంది సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని సమర్థిస్తూ ఉన్నారు.

MAA President Manchu Vishnu advice to MAA members Wake of Recent Tollywood Incidents

ఇలాంటి క్లిష్ట తరుణంలో మా అధ్యక్షుడు మంచు విష్ణు ఒకే విధమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ మా అధ్యక్షుడిగా ఓ అధికారిక ప్రకటనను విడుదల చేశారు ఈ ప్రకటనలో.. మా సభ్యులందరికీ తెలియజేయునది ఏమనగా 'మా' కళాకారులు ఎప్పుడు అన్ని ప్రభుత్వాలతో, ప్రజా ప్రతినిధులతో సంహిత సంబంధాలను కొనసాగిస్తూ ఉంటారు. చిత్ర పరిశ్రమ అనేది సహాయం సహకారం సృజనాత్మకతపై ఆధారపడి నడుస్తోంది. గతంలో వివిధ ప్రభుత్వాల మద్దతు వల్ల సినిమా ఇండస్ట్రీ ఎంతగానో అభివృద్ధి చెందింది. ప్రత్యేకంగా టాలీవుడ్ హైదరాబాదులో స్థిరపడడానికి అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సాహం అందించింది. ఈ విధంగా ప్రతి ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ తో సత్సంబంధాలను కొనసాగిస్తూ ఉంది' అంటూ పలు విషయాలను గుర్తు చేశారు మంచు విష్ణు.

'గత వారం పది రోజులుగా ఇండస్ట్రీలో పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సందర్భంగా కొన్ని విషయాలను తెలియ చేయదలుచుకున్నాను. ఇటీవల ఇండస్ట్రీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై సభ్యులందరూ సున్నితత్వంగా వ్యవహరించాలని వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగంగా ప్రకటించడం గాని, వివాదాస్పద అంశాలపై చర్చించ అవసరం లేదు కొన్ని సమస్యలు వ్యక్తిగతమైనవి మరికొన్ని వివాదాస్పదమైనవి. అటువంటి ఘటనపై చట్టం, కోర్టులు తమకు నిర్ణయాన్ని అవి తీసుకుంటాయని మంచు విష్ణు తెలిపారు.

మంచు విష్ణు ఇంకా కంటిన్యూ చేస్తూ.. 'ఈ సమయంలో మనందరికీ సహనం సానుభూతి అవసరం మనీ తెలియజేశారు రాబోయే పండుగలా సందర్భంగా అందరికీ క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. మా మూవీ అసోసియేషన్ అనేది ఓ పెద్ద కుటుంబమని ఏ సమస్య వచ్చినా మనమంతా కలిసి వాటిని ఎదిరించాలి' అంటూ మంచు విష్ణు పేర్కొన్నాడు.

More from Filmibeat

Read more about: manchu vishnu maa allu arjun
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X