twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగబాబు అలా అనడం కరెక్ట్ కాదు.. లోకల్ నాన్ లోకల్ ఏంటి.. ఎప్పుడైనా ఓటెయ్యడానికి వచ్చారా: నరేష్

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా కాలం తరువాత ఎన్నికల హడావుడి మొదలైంది. గతంలో ఎప్పుడు లేని విదంగా ఈసారి అగ్ర తారల మధ్య పోటీ నెలకొనడం హాట్ టాపిక్ గా మారింది. ప్రకాష్ రాజ్ లాంటి అగ్ర నటుడు టాలీవుడ్ మా ఎన్నికల్లో ఉండడంతో పోటీ రసవత్తరంగా మారింది. ఇక ప్రెస్ మీట్స్ లో రాజకీయ విమర్శలు కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. మా ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ కూడా ప్రెస్ మీట్ లో కౌంటర్స్ ఇవ్వడంతో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది.

    నరేష్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం

    నరేష్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం

    మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, అలాగే జీవిత రాజశేఖర్ ఒకేసారి ఎన్నికల భరిలో పోటీ పడుతుండడంతో ఈ ఎన్నికల రిజల్ట్ పై జనాల ఫోకస్ కూడా గట్టిగానే పడింది. ఇక పోటాపోటీగా ఒకరిపై మరొకరు కామెంట్స్ చేసుకోవడం కూడా హాట్ టాపిక్ గా మారుతోంది. నిన్న ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు చేసిన కామెంట్స్ పై నేడు నరేష్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

    తీవ్ర స్థాయిలో అసంతృప్తి

    తీవ్ర స్థాయిలో అసంతృప్తి

    నరేష్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కరోనా కష్టకాలంలో ఇన్సూరెన్స్ పనులు కూడా అలానే కొనసాగుతున్నాయి. కానీ ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లుగా కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు. ప్రకాష్ రాజ్ తో ప్రస్తుతం 'మా'లో ఉన్న కమిటీ మెంబర్స్ కూడా ఉండడం బాధను కలిగించింది. పెద్దలు అందరూ కూడా తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు.. అని మాట్లాడారు.

    నాగబాబు తప్పుగా మాట్లాడారు

    నాగబాబు తప్పుగా మాట్లాడారు

    నాగబాబు చేసిన కామెంట్స్ పై మాట్లాడుతూ.. నాగ బాబు నాకు మంచి మిత్రులు. అయితే నిన్న ప్రెస్ మీట్ లో నాలుగేళ్లుగా మా మసకబారిపోయింది అనడం కరెక్ట్ కాదు. పొరపాటునా కూడా అలాంటి మాట అనకూడదు. అది చాలా తప్పు. 'మా'లో చేసిన పనులన్నీ కూడా ఆయనకు తెలుసు. అందరికి మేము చేసిన పనులపై ఎప్పటికప్పుడు వివరణ ఇస్తున్నాము.. అని చెప్పారు.

    ఒక డాక్యుమెంట్ ను రెడీ చేశాము

    ఒక డాక్యుమెంట్ ను రెడీ చేశాము

    ఇక మా లో కొంత విబేధాలు ఉన్న మాట వాస్తమే అని తెలిపిన నరేష్ మళ్ళీ పెద్దల సమక్షంలో అందరూ మాట్లాడి ఏకం చేశారని అన్నారు. ఇక ఈ రెండేళ్లలో మా లో ఎలాంటి పనులు జరిగాయి అనే విషయాన్ని మేము రివ్యూ చేసుకున్నాం. ఈ నాలుగేళ్ళలో మా మసక బారిపోయిందా లేక ముందడుగు వేసిందా అనే విషయాలని ఒక డాక్యుమెంట్ ను రెడీ చేశాము. వాటిని మీడియాకి కూడా ఇస్తాము.. అని నరేష్ తెలియజేశారు.

    ఓటెయ్యడానికి ఎప్పుడైనా వచ్చారా?

    ఓటెయ్యడానికి ఎప్పుడైనా వచ్చారా?

    ఇక ప్రస్తుతం ప్రకాష్ రాజ్ పోటీగా ఉండడంతో లోకల్ నాన్ లోకల్ అని విపిస్తున్న కామెంట్స్ పై కూడా నరేష్ స్పందించారు. మేము ఎవరం కూడా లోకల్ నాన్ లోకల్ అనలేదు. మీరంటున్నారు. మా లో ఎవరైనా పోటీ చేయవచ్చు. అయితే 'మా'కు ఎవరు ఎంత వరకు సహకరించారు. అసలు ఓటెయ్యడానికి ఎప్పుడైనా వచ్చారా? అనేది వాళ్లే డిసైడ్ చేసుకోవాలని నరేష్ అన్నారు.

    English summary
    The Tollywood Movie Artist Association election heat is heating up once again. It is well known that over the past few years the conditions and differences of our association have been going viral in the media. With Prakash Raj in the fray this time around, the election battle has intensified. Jayasudha and Sai Kumar also provided their support through video.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X