‘చిరంజీవి కళ్యాణ లక్ష్మి’ పథకం.. రూ. లక్ష 16 వేలు!

Recommended Video

Sivaji Raja Superb Speech At His Birthday Celebrations | Filmibeat Telugu

'మా' అధ్యక్షుడు శివాజీ రాజీ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరుపున 'చిరంజీవి కళ్యాణ లక్ష్మి' పథకం చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయమై శివాజీ రాజా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చాలా గొప్పగా ఉంది. ఎప్పుడూ ఏది అడిగినా వెంటనే స్పందిస్తుంది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, వారి ప్రభుత్వం చాలా బాగా పని చేస్తోంది. వారి పథకాలు మేము కాపీ కొట్టినా వంద శాతం మీరు ఎంత జెన్యూన్‌గా చేస్తారో మేము కూడా అంతే జెన్యూన్‌గా చేస్తామని తెలిపారు.

చిరంజీవి కళ్యాణ లక్ష్మి పథకం

చిరంజీవి కళ్యాణ లక్ష్మి పథకం

చిరంజీవిగారి కళ్యాణ లక్ష్మి ద్వారా అనేక మంచి పనులు చేయాలనుకుంటున్నాం. ప్రెస్ వాళ్ల పిల్లలు ఎవరికైనా ఆడపిల్లల పెళ్లయితే లక్ష పదహారు వేలు ఇస్తాం. అదే విధంగా మా ఆర్టిస్టుల పెళ్లయితే లక్ష పదహారు వేలు ఇవ్వడమే కాదు వందల కోట్ల విలువైన గిఫ్ట్‌గా చిరంజీవిగారిని ఆశీర్వదించడానికి తీసుకొస్తాం. గొప్పోళ్ల పెళ్లికి ఆయన వెళ్లొచ్చు.. ఒక లేనోడి పెళ్లికి చిరంజీవిగారు వస్తే లక్షల కోట్ల విలువే కదా..ఆయన మాకు వస్తానని మాట ఇచ్చారని శివాజీ రాజా తెలిపారు.

16 ఏళ్ల క్రితం మోహన్ బాబు నుంచి కాల్

16 ఏళ్ల క్రితం మోహన్ బాబు నుంచి కాల్

16 సంవత్సరాల క్రితం శ్రీకాంత్ తెల్లవారుఝామున ఫోన్ చేసి మోహన్ బాబుగారు రమ్మంటున్నారు అన్నారు. అప్పటికీ నాకు మోహన్ బాబు గారితో పెద్దగా పరిచయం లేదు. ఆయనతో సినిమాలు కూడా ఎప్పుడూ చేయలేదు. ఉదయం 5 గంటలకు ఆయన ఇంటికి వెళ్లాం. వెళ్లిన తర్వాత ఆయన... మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ప్రెసిడెంటుగా చేయాలనుకుంటున్న విషయం చెప్పారు. అదే సమయంలో అపుడు సెంట్రల్ మినిస్టర్‌గా ఉన్న దాసరి నారాయణరావుగారికి ఫోన్ చేసి శివాజీ రాజా మంచి హ్యూమన్ బీయింగ్, అతడినే జనరల్ సెక్రటరీగా పెట్టుకుంటున్నామని చెప్పినట్లు.. శివాజీ రాజా గుర్తు చేసుకున్నారు.

చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి

చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి

హ్యూమన్ బీయింగ్ అనే పదానికి అర్థం నాకు తర్వాత నాకు తెలిసింది. ఎవరైనా ఆపదలో ఉంటే కాపాడుకుంటాడు అని... దాన్ని ఫాలో అవుతూ ముందుకు వెళ్లాను. అదే నన్ను ఈ రోజు ప్రెసిడెంటుగా నిలబెట్టింది. ప్రెసిడెంటుగా ఉండాలని నాకేమీ లేదు.. అందరూ కోరుకుంటే ఉన్నాను. చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయని శివాజీ రాజా వ్యాఖ్యానించారు.

ప్రభాస్, నాగార్జున ఫ్యామిలీ ఓకే చెప్పారు

ప్రభాస్, నాగార్జున ఫ్యామిలీ ఓకే చెప్పారు

నేను, బెనర్జీ వెళ్లి ప్రభాస్‌ను అమెరికాలో కార్యక్రమం చేస్తున్నాము రావాలని కోరితే ఒక రెండు నెలలు ముందు చెప్పండి ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని చెప్పారు. అలాగే నాగార్జున గారి ఎంటైర్ ఫ్యామిలీ స్పందించారు. మిగతావారెవరీని మేము ఇంకా కాంటాక్ట్ చేయలేదు. వీరిని మాత్రమే కాటాక్ట్ చేశాం. మేము అడిగితే విజయ్ దేవరకొండ దగ్గర నుంచి అల్లు అర్జున్, రామ్ చరణ్ వరకు ఎవరూ కాదనరు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X