twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దిశ ఘ‌ట‌న‌పై స్పందించిన ‘మా’.. గ‌వ‌ర్న‌ర్‌కి విన్న‌పం

    |

    హైద‌రాబాద్‌లో జరిగిన దిశ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌న‌మైన సంగ‌తి తెలిసిందే. డాక్ట‌ర్ ప్రియాంక హ‌త్యోదంతంపై సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై సమాజం మొత్తం వ్యతిరేకంగా నిలబడగా.. నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నివైపుల నుంచి నినాదాలు వినిపిస్తున్నాయి. ఆ ఘ‌ట‌న‌కు కార‌కులైన దోషులకు మ‌ర‌ణ‌దండ‌న విధించాల‌ని సమాజం మొత్తం ఆగ్రహజ్వాలలు ఎగిసి పడుతున్నాయి.

    దిశ హ‌త్య‌చారం లాంటి ఘ‌ట‌న‌లు తిరిగి పున‌రావృతం కాకుండా జాగ్ర‌త్త ప‌డాల‌ని, దిశ‌కు జ‌రిగిన అన్యాయం వేరొక‌రికి జ‌ర‌గ‌కూడ‌ద‌ని, ఈ కేసుపై వేగంగా ద‌ర్యాప్తు జ‌రిపి తొంద‌ర‌గా దోషుల‌కు శిక్ష ప‌డేలా చేయాల‌ని కోరుతూ తెలంగాణ గ‌వ‌ర్నర్ తమిళిసై సౌంద‌ర‌రాజ‌న్ ని మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ప్ర‌తినిధులు క‌లిశారు. మా జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ జీవిత రాజ‌శేఖ‌ర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజ‌శేఖ‌ర్.. ఉపాధ్య‌క్షురాలు హేమ‌.. అనిత చౌద‌రి.. జ‌య‌ల‌క్ష్మి త‌నీష్‌, సురేష్ కొండేటి.. ఏడిద శ్రీ‌రామ్.. ర‌వి ప్ర‌కాష్ త‌దిత‌రులు గ‌వ‌ర్న‌ర్ కి విన్న‌వించారు.

    MAA Reacted On Disha Incident And Complaint To Governor Tamilisai

    గురువారం (డిసెంబర్ 5) సాయంకాలం ఐదు గంటల నుంచి ఏడు గంటలవరకు తెలుగు పరిశ్రమలోని అన్ని విభాగాలవారు డా. జస్టిస్ ఫర్ దిశా ఆత్మశాంతి కొరకు సంతాప సభను ఏర్పాటు చేస్తున్నట్లు మా కార్యవర్గం ప్రకటించింది. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లోని కన్వెన్షన్ హాలులో ఈ సభను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. సభ్యులందరు ఐదు గంటలకు రామానాయుడు కళామండపం దగ్గర సమావేశం కావాలని 'మా'కార్యవర్గం కోరింది.

    English summary
    MAA Reacted On Disha Incident And Complaint To Governor Tamilisai. Hema, Raja Sekhar, Jeevitha, Tanish, Ravi Prakash Etec All Members Of MAA Visited Raj Bavan Today. On December 5th They Are Paying Tribute To Disha Incident At FIlm Chamber.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X