For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తట్టుకోలేకపోతున్నా.. నేను త్వరలోనే చచ్చిపోతా.. యంగ్ హీరోయిన్ షాకింగ్ పోస్ట్

  |

  తానూ త్వరలోనే చచ్చిపోతా అంటూ యంగ్ హీరోయిన్ పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం జనాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తనకు తీవ్రంగా ఆరోగ్య సమస్యలున్నాయని, ఆ మందులు కూడా పనిచేయని పరిస్థితి నెలకొంటోందని పేర్కొంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆ హీరోయిన్.. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా సంచలన పోస్ట్ పెట్టింది. ఇంతకీ ఎవరా హీరోయిన్? ఆమె సమస్య ఏంటి? వివరాల్లోకి పోతే..

  నచ్చావులే అంటూ అలరించి ఆ తర్వాత

  నచ్చావులే అంటూ అలరించి ఆ తర్వాత

  'నచ్చావులే' సినిమాతో అలరించిన మాధవీలత.. నాని హీరోగా వచ్చిన 'స్నేహితుడా' సినిమాలో కూడా నటించింది. ఆ తర్వాత ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో కొన్ని సినిమాలకే పరిమితమైన ఆమె చివరకు వెండితెరపై కనుమరుగైపోయింది. ఇక ఆ వెంటనే పొలిటికల్ జర్నీ మొదలుపెట్టి మొన్నటి ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ కూడా చేసింది మాధవీ లత.

  సినిమా అవకాశాలు లేకపోయినా.. అక్కడ మాత్రం

  సినిమా అవకాశాలు లేకపోయినా.. అక్కడ మాత్రం

  ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలు లేకపోయినా.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అందరితో టచ్‌లో ఉంటుంది మాధవీలత. అంతేకాదు అప్పుడప్పుడు టీవీల్లో జరిగే డిస్కషన్స్‌లో కనిపిస్తూ పలు డిబేట్స్‌లో పాల్గొంటూ ఉంటుంది.

  ఫేస్‌బుక్ పోస్ట్.. చచ్చిపోతా అంటూ మెసేజ్

  ఫేస్‌బుక్ పోస్ట్.. చచ్చిపోతా అంటూ మెసేజ్

  కాగా తాజాగా మాధవీలత పెట్టిన ఓ ఫేస్‌బుక్ పోస్ట్ చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నారు జనం.

  అందులో ఆమె చచ్చిపోతానని తెలపడం తీవ్ర కలకలం రేపుతోంది. తనను అనేక అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయని, త్వరలోనే తాను కూడా చచ్చిపోతానని ఆ పోస్ట్‌లో పేర్కొంది మాధవీలత.

  మాధవి పోస్ట్.. ఉన్నది ఉన్నట్లుగా

  మాధవి పోస్ట్.. ఉన్నది ఉన్నట్లుగా

  నేనెపుడు నా ఫ్రెండ్సుతో చెప్తూ ఉంటాను

  ఎదో ఒక రోజు "ప్రేమ" సినిమా లో రేవతి ల

  చచ్చిపోతా అని

  అందులో కూడా తాను ఎపుడు ఎదో ఒక మెడిసిన్ వేసుకుంటూ ఆఖరికి ఎలాంటి మెడిసిన్ పని చేయకుండా పోతది నేను అంతేనేమో

  ఎపుడు నన్ను ఏడిపించే

  3 విషయాలు

  మైగ్రేన్ తలనొప్పి

  జలుబు&జ్వరం

  నిద్రలేమి

  వీటికోసం మందులు ..... i hate medicines

  ... కలలున్నాయి కోరికలున్నాయి ఆశలున్నాయి

  ఈ మందులు నా ఆయుష్షు ఉంచవేమొ

  నెటిజన్ల కామెంట్స్..

  ఇక మాధవీలత పెట్టిన ఈ పోస్టు వైరల్ కావడంతో.. దీనిపై ఆమె అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. జీవితంలో ఎవరికైనా ఇలాంటి కష్టాలు వస్తాయని, ఆ మాత్రం దానికే చనిపోతారా కామెంట్స్ పెడుతున్నారు. ఇంకొందరైతే మరికొందరు తాము కూడా ఇలానే సఫర్ అవుతున్నామని కామెంట్ చేస్తుండటం విశేషం.

  Madhavi Latha's Love Letter To Pawan Kalyan
  కామవాంఛ తీరిస్తే తప్ప..

  కామవాంఛ తీరిస్తే తప్ప..

  గతంలో సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై స్పందించిన మాధవీలత.. తనను కూడా కమిట్మెంట్ అడిగారని, అయితే వాళ్ల ఆలోచన అర్థం చేసుకుని నో చెప్పినట్లు తెలిపింది. పడకగదికి వెళ్లి వాళ్ల కామవాంఛ తీరిస్తే తప్ప తెలుగులోనే కాదు.. ఎక్కడా హీరోయిన్లకు అవకాశాలు వచ్చే పరిస్థితి లేదనే కోణంలో మాధవీలత మాట్లాడింది.

  English summary
  Heroine Maadhavi Latha facebook post viral on social media. She posted about her diseases and tell her life span.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X