Maanas కు టాలీవుడ్‌లో భారీ ఆఫర్.. ఇద్దరు హీరోయిన్లతో 5G Love

చైల్డ్ ఆర్టిస్టుగా, హీరోగా, టెలివిజన్ సీరియల్ ఆర్టిస్టుగా టాలీవుడ్‌లో రాణిస్తున్న మానస్ నాగులపల్లి పేరు ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. బిగ్‌బాస్ తెలుగు 5లోకి వెళ్లడానికి ముందు సాధారణ ఆర్టిస్టుగానే పరిచయమున్న మానస్ ప్రస్తుతం అసాధారణ సెలబ్రిటీగా మారిపోయారు. బిగ్‌బాస్‌లోకి వెళ్లిన తర్వాత అతడి వ్యక్తిత్వం అందర్నీ ఆకట్టుకోవడంతో భారీ ఫాలోయింగ్, క్రేజ్‌ను సొంతం చేసుకొన్నారు.

బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగానే టాలీవుడ్ నుంచి మానస్‌కు భారీ ఆఫర్లు తలుపుతడుతున్నాయి. అయితే ఈ ఏడాది ఆయన హీరోగా నటించిన క్షీరసాగర మథనం చిత్రం ప్రేక్షకాదరణ పొందింది. మానస్ బిగ్‌బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో విడుదలవ్వగా ఇక్కడ కూడా అనూహ్య స్పందన దక్కించుకుంది.

 Maanas Nagulapalli to play hero role in 5 G Love

ఇక బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకి వచ్చిన వెంటనే మానస్ మరిన్ని ప్రాజెక్టులతో బిజీగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిగ్‌బాస్ నుంచి బయటకు రాగానే ముందుగా 5జి లవ్ అనే చిత్రంలో మానస్ కథానాయకుడిగా నటించనున్నారు.

స్క్వేర్ ఇండియా స్టూడియోస్ బ్యానర్‌పై ప్రతాప్ కోలగట్ల 5 జీ లవ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో ప్రతాప్ 3జి లవ్ అనే యూత్ ఫుల్ అండ్ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాన్ని నిర్మించారు. రాజ్ ముదునూరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.

5 జీ లవ్ కథ ప్రకారం ఇందులో ఇద్దరు కథానాయికలు ఉంటారు. పలు హిట్ చిత్రాలకి సంగీతం అందించిన శేఖర్ చంద్ర '5జి లవ్' కి సంగీతం అందిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే విధంగా ఈ చిత్రం రూపొందనుందని చిత్ర యూనిట్ తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X