#MAD Teaser Review నీవు కొట్టుకొంటావా? ఫన్నీగా మ్యాడ్ టీజర్.. జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ధి హిట్ కొట్టేనా?
తెలుగు సినిమా పరిశ్రమలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సూర్యదేవర రాధాకృష్ణ (చిన్నబాబు) నిర్మాణ సారథ్యంలో హారికా సూర్యదేవర తొలి చిత్ర నిర్మాతగా వ్యవహరిస్తూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ జూనియర్ బావమరిది నార్నే నితిన్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం #Mad. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రక్షా బంధన్ పండుగ నేపథ్యంలో మ్యాడ్ సినిమా టీజర్‌ను ప్రేక్షకులకు అందించారు. ఈ టీజర్ వివరాల్లోకి వెళితే..
మ్యాడ్ చిత్రం టీజర్ చూస్తే పక్కాగా యూత్ అంటే.. నేటితరం యువకుల అభిరుచిని టార్గెట్ చేసుకొని రూపొందించిన చిత్రంగా కనిపించింది. ఈ చిత్రం ద్వారా నార్నే నితిన్, సంగీత శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరి ప్రియారెడ్డి, అనంతిక సానిల్ కుమార్, గోపికా ఉద్యాన్ తదితరులు తెలుగు సినిమా ప్రేక్షకులు చేరువ కానున్నారు. సితార బ్యానర్‌లో 18వ చిత్రంగా నిర్మించడం గమనార్హం.

ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల జీవితాల్లో జరిగే చిలిపి, సరదా సంఘటనలు నేపథ్యంగా రూపొందినట్టు టీజర్‌లో అంశాలు స్పష్టం చేశాయి. కాలేజ్ ర్యాంగింగ్‌లో ట్యూబ్ లైట్ సైజును లెక్కించి.. ఓ విద్యార్థి.. మరో విద్యార్థిని మొత్తం పెట్టుకో అంటూ టీజ్ చేయడం ఫన్‌గా కనిపించింది. ఇక సిగరెట్ తాగుతూ తండ్రికి దొరికిపోయిన సీన్‌లో.. బాబాయ్ అని కొడకు స్నేహితుడు అంటే.. ఎవడురా నీకు బాబాయ్ అని తండ్రి ప్రశ్నిస్తే.. అయితే పెద్దనాన్న అంటూ జోక్ చేయడం ఈ సినిమాలో వినోదానికి సాక్ష్యంగా నిలిచింది.

ఫన్, లవ్, ఎమోషనల్ కంటెంట్‌లో మ్యాడ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించింది. ఈ సినిమాకు లేటేస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ భీమ్స్ సిసిరోలీయో సంగీతం అందించారు. యూత్ టేస్ట్‌కు తగినట్టుగా ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోరు ఉన్నట్టు అనిపించింది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ కాబోతుందనే విషయం పక్కన పెడితే.. ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి వస్తున్న నార్నె నితిన్ హీరోగా ఎస్టాబ్లిష్ అవుతాడా? మొదటి సినిమాతోనే హిట్ కొడుతాడా? అనేది వేచి చూడాల్సిందే.
నటీనటులు: నార్నే నితిన్, సంగీత శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరి ప్రియారెడ్డి, అనంతిక సానిల్ కుమార్, గోపికా ఉద్యాన్, రఘుబాబు, రచ్చ రవి, మురళీధర్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, ఆంథోని తదితరులు
రచన, దర్శకత్వం: కల్యాణ్ శంకర్
సమర్పణ: ఎస్ నాగవంశీ
నిర్మాతలు: హారికా సూర్యదేవర, సాయి సౌజన్య
మ్యూజిక్: భీమ్స్ సిసిరోలియో
ఎడిటర్: నవీన్ నూలి
డీవోపీ: షాందత్ సాయినుద్దీన్, దినేష్ కృష్ణన్ బీ
ఆర్ట్: రామ్ అరసవిల్లి
స్క్రీన్ ప్లే: ప్రవీణ్ పట్టు, ప్రణయ్ రావు తక్కలపల్లి
ఫైట్ మాస్టర్: కరుణకరన్
బ్యానర్: సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్యూన్ ఫోర్ సినిమాలు


Click it and Unblock the Notifications











