twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sai Dharam Tej ఎంత వేగంతో వెళ్తున్నారంటే.. సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నాం.. మాదాపూర్ డీసీపీ వెల్లడి..

    |

    మెగా హీరో సాయిధరమ్ తేజ్ స్పోర్ట్ బైక్ అదుపుతప్పడంతో ఆయన ప్రమాదానికి గురైంది. వేగంగా వాహనాన్ని నడపడం వల్ల ప్రమాదం జరిగిందని మాదాపూర్ పోలీసులు వెల్లడించారు. సాయిధరమ్ తేజ్ ప్రమాదం గురించి మాదాపూర్ డీసీసీ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. ఆయన ప్రమాదం గురించి, సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం గురించి వెల్లడించారు. మాదాపూర్ డీసీపీ వెల్లడించిన ప్రకారం..

    జూబ్లీహిల్ రోడ్ నంబర్ 45 నుంచి

    జూబ్లీహిల్ రోడ్ నంబర్ 45 నుంచి


    జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 నుంచి కేబుల్ బ్రిడ్జీ మీదుగా గచ్చిబౌలికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అతి వేగం వల్లే ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన స్థలంలో ఇసుక ఉండటం వల్ల బండి స్కిడ్ అయింది. ప్రమాదం అనంతరం ఆయనను మెడికవర్ హాస్పిటల్‌కు తరలించారు. ఆయనకు సీటిస్కాన్ నిర్వహించారు. పోలీసు ఉన్నతాధికారులు హస్పిటల్‌లోకి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు అని డీసీప వెంకటేశ్వర్లు చెప్పారు.

    దుర్గం చెరువు దాటిన తర్వాత

    దుర్గం చెరువు దాటిన తర్వాత


    దుర్గం చెరువు దాటిన తర్వాత ప్రమాదం జరిగింది. స్పోర్ట్స్‌ బైక్ ట్రింప్ ట్రైండెంట్ 660 బైక్‌పై ప్రయాణిస్తున్నారు. బైక్ కొత్త బైక్. బండి వివరాలు తీసుకొన్నాం. ఎడమవైపు పడ్డారు. ఐకియా స్టోర్ దాటిన తర్వాత కిందపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్స్‌లో మెడికవర్ హాస్పిటల్‌కు తరలించాం అని డీసీపీ వెంకటేశ్వర్లు చెప్పారు.

    సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నాం

    సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నాం

    సాయిధరమ్ తేజ్ ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం. ఆయన ప్రయాణించిన దారిలో సీసీటీవీ ఫుటేజ్‌‌ను పరిశీలిస్తున్నాం. అనంతరం వాటి ఆధారంగా వివరాలు వెల్లడిస్తాం. ప్రస్తుతం మెడికల్ రిపోర్టుల కోసం వేచి చూస్తున్నాం. ప్రమాద స్థలంలో బైక్‌ను స్వాధీనం చేసుకొన్నాం. సీసీటీవీ ఫుటేజ్ వచ్చిన తర్వాత ఈ ప్రమాదంపై స్పందిస్తాం అని డీసీపీ చెప్పారు.

    Recommended Video

    Bheemla Nayak Singer Mogulaiah Launches Sundarangudu Poster
    మూడు చోట్ల గాయాలు

    మూడు చోట్ల గాయాలు

    ఇక సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై మీడియా కథనాల ప్రకారం.. దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సాయిధరమ్ తేజ్‌కు మూడు చోట్ల బలమైన దెబ్బలు తగిలాయి. ఇంకా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయలేదు. డాక్టర్ల రిపోర్టు గురించి వెయిట్ చేస్తున్నాం. ఎంత స్పీడ్‌లో వెళ్తున్నారనే విషయం వెల్లడిస్తాం అని చెప్పారు.

    English summary
    Madhapur DCP Venkateshwarlu reveals Sai Dharam Tej accident, as per Official Communication from Medicover hospital, Madhapur Sai Dharam Tej is absolutely fine and recovering. Nothing to worry. He is under precautionary care in hospital.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X