twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనుష్క నిశ్శబ్దం అప్‌డేట్.. మాధవన్ రోల్ ఇదే

    |

    టాలీవుడ్ స్వీటీ అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త సినిమా 'నిశ్శబ్దం'. బాహుబలి సిరీస్ ద్వారా తన పాపులారిటీని మరింత పెంచుకున్న స్వీటీ.. ఈ సినిమాలో డిఫరెంట్ రోల్ పోషిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది. ఈ లుక్‌లో వైట్ బోర్డుపై పెయింటింగ్ చేస్తూ కనిపించింది అనుష్క. గతంలో కంటే మరింత గ్లామరస్ గా కనిపించింది.

    ఇదిలా ఉంటే తాజాగా 'నిశ్శబ్దం' సినిమాలో మాధవన్ రోల్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. సెలబ్రిటీ మ్యూజిషియన్ ఆంటోనీ పాత్రలో మాధవన్ కనిపించనున్నారని పేర్కొంటూ ఆయన లుక్ పోస్ట్ చేశారు. ఈ లుక్ లో గిటార్ వాయిస్తూ స్టైలిష్ గా కనిపించారు హీరో మాధవన్. అంటే ఈ చిత్రంలో అనుష్క.. సాక్షి పాత్రలో ఒక మౌన కళాకారిణిగా నటిస్తుండగా, మాధవన్.. ఆంటోనీ పాత్రలో ఫేమస్ మ్యూజిషియన్ గా అలరించ బోతున్నారన్నమాట.

    Madhavan look released from Anushka Shettys Nishabdam

    ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ సంయుక్తంగా 'నిశ్శబ్దం' చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌కి చెందిన పలువురు న‌టీన‌టుల‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమా రూపొందుతోంది. అనుష్క శెట్టి, ఆర్.మాధ‌వ‌న్, అంజ‌లి, మైఖేల్ మ్యాడ‌స‌న్, షాలిని పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస అవ‌స‌రాల‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళ, ఇంగ్లీషు, హిందీ, మ‌ల‌యాళం భాష‌ల్లో భారీ స్ధాయిలో రిలీజ్ చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు.

    చాలా గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తుండటం కారణంగా ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. మౌన కళాకారిణిగా సరికొత్త పాత్రలో అనుష్కను చూడాలని కుతూహలంగా ఉంది ప్రేక్షకలోకం. అతిత్వరలో ఈ సినిమా విడుదల కానుంది.

    English summary
    After long gap of Bhagamathi Anushka starts a new movie Nishabdam. This movie shooting started in America. Today from this movie Madhavan look released.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X