‘రాకెట్రీ-ది నంబి ఎఫెక్ట్’... మాధవన్ లుక్ ఇదే!
సౌత్ స్టార్ మాధవన్ త్వరలో 'రాకెట్రీ-ది నంబి ఎఫెక్ట్' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. తాజాగా ఈ చిత్రంలో మాధవన్ లుక్ ఎలా ఉండబోతోందో రివీలైంది.
ఈ చిత్రంలో నంబి నారాయణన్ మాదిరిగా గడ్డం పెంచి డిఫరెంట్ లుక్‌లో మాధవన్ కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో మాధవన్ నటించడంతో పాటు తమిళ దర్శకుడు అనంత మహదేవన్‌తో కలిసి స్వయంగా దర్శకత్వం బాధ్యతలను కూడా చేపడుతున్నాడు.

నంబి నారాయణన్ ఇస్రోలో సీనియర్ సైంటిస్ట్. అయితే అతడు గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడ్డట్లు 1994లో ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆయన అప్పట్లో 50 రోజులు జైల్లో గడిపారు. అతడిపై వచ్చిన ఆరోపణలను సీబీఐ 1996లో కొట్టిపారేసింది. 1998లో సుప్రీం కోర్టు సైతం ఏ తప్పూ చేయలేదని తేల్చి చెప్పింది. ఈ సంఘటనకు సంబంధించిన అంశాలను ఫోకస్ చేస్తూ ఈ సినిమా సాగుతుంది.
'రాకెట్రీ-ది నంబి ఎఫెక్ట్' చిత్రాన్ని 2019 సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళ, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











