రామ్ పోతినేనిపై పోటీకి సీనియర్ హీరో రెడీ: ఎనర్జిటిక్ స్టార్ వర్సెస్ కోలీవుడ్ స్టార్
ఈ మధ్య కాలంలో వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు ఉస్తాద్ రామ్ పోతినేని. ఈ క్రమంలోనే ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామీతో ఓ సినిమాను చేయబోతున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం.. అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది. దీంతో ఈ సినిమా గురించి ఎన్నో ఊహాగానాలు ఫిలిం నగర్ ఏరియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇందులో విలన్‌గా నటించబోయే యాక్టర్ గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది.
లింగుసామీ - రామ్ పోతినేని కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న విషయం తెలిసిందే. అందుకోసం రెండు భాషల్లో పరిచయం ఉన్న నటీనటులను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఈ సినిమాలో విలన్‌గా చేసే నటుడిపై బాగా ఫోకస్ చేశారు. తాజా సమాచారం ప్రకారం.. రామ్ నటిస్తోన్న ఈ సినిమాలో కోలీవుడ్ సీనియర్ హీరో మాధవన్ ప్రతి నాయకుడిగా నటించబోతున్నాడట. ఇప్పటికే అతడు అక్కినేని హీరో నాగ చైతన్య నటించిన 'సవ్యసాచి'లో నెగెటివ్ రోల్ చేసి మెప్పించిన విషయం తెలిసిందే.

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందబోతున్న ఈ సినిమాలో రామ్ రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడని ఎఫ్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఇందులో అతడు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడని అంటున్నారు. దీంతో ఈ చిత్రంపై బజ్ ఏర్పడింది. ఇక, ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ నదియా కూడా కీలక పాత్రను పోషిస్తుందట. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చబోతున్నాడు.


Click it and Unblock the Notifications











