శ్యామ్ సింగ రాయ్ మూవీపై మధుబాల సెల్ఫీ వీడియో: ఊహించని కామెంట్లు.. సాయి పల్లవి రిప్లై
తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వెళ్తోన్న హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకడు. స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే అసాధారణమైన నటనతో స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు. అయితే, ఈ టాలెంటెడ్ హీరో 'జెర్సీ' తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం ప్రాకులాడుతున్నాడు. ఇందులో భాగంగానే వరుస పెట్టి పలు చిత్రాలను ప్రేక్షకులకు అందించాడు. కానీ, అవేమీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. దీంతో నానితో పాటు అతడి ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు.
ఈ సారి ఎలాగైనా భారీ సక్సెస్‌ను అందుకోవాలన్న లక్ష్యంతో నాని 'శ్యామ్ సింగ రాయ్' అనే సినిమాను చేశాడు. పునర్జన్మల నేపథ్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రాన్ని 'టాక్సీవాలా' ఫేం రాహుల్ సంకృత్యన్ వైవిధ్యమైన కథతో తెరకెక్కించాడు. నాని మార్కెట్ ప్రకారం ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో కలుపుకుని ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో చిత్ర యూనిట్ ఈ మూవీని భారీ స్థాయిలో విడుదల చేసింది. ఇక, క్రిస్టమస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి.

చాలా కాలంగా హిట్ కోసం చూస్తున్న నేచురల్ స్టార్ నాని చేసిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీకి ఆరంభంలో మంచి కలెక్షన్లు వచ్చాయి. దీంతో అతడికి మంచి ఓపెనింగ్స్ సొంతం అయ్యాయి. మరీ ముఖ్యంగా ఏపీ తెలంగాణలో కలెక్షన్లు మంచిగా వచ్చాయి. కానీ, ఈ మధ్య కలెక్షన్లు క్రమంగా పడిపోతూ వచ్చాయి. ఇక, ముగింపు సమయానికి నాని సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలుపుకుని రూ. 26.50 కోట్లు వసూలు చేసింది. దీంతో హిట్ స్టేటస్‌తో పాటు రూ. 4 కోట్లు లాభాలను అందుకుని రికార్డు క్రియేట్ చేసింది. అదే సమయంలో నానికి కొత్త ఉత్సాహాన్ని అందించింది.
నాని నటించిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీ జనవరి 21 నుంచి ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్టీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాను సీనియర్ హీరోయిన్ మధుబాల అలియాస్ మధూ వీక్షించారు. ఈ నేపథ్యంలోనే ఆమె ట్విట్టర్‌లో సెల్ఫీ వీడియోను షేర్ చేశారు. అందులో 'శ్యామ్ సింగ రాయ్ మూవీని చూశాను. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో నా ఫేవరెట్ సాయి పల్లవి యాక్టింగ్ అదరగొట్టేసింది. అలాగే, నాని కూడా బాగా నటించాడు. అందరికీ ఆల్ ది బెస్ట్' అంటూ పేర్కొన్నారు. ఇక, దీనికి సాయి పల్లవి రిప్లై ఇచ్చింది. 'మీ మంచి మాటలకు చాలా ధన్యవాదాలు. మీ మాటలతో నేను పొంగిపోతున్నాను' అని ట్వీట్ చేసింది.
నాని - రాహుల్ కాంబినేషన్‌లో వచ్చిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీని వెంకట్ బోయినపల్లి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చాడు. ఇందులో నాని ద్విపాత్రాభినయం చేశాడు. ఇక, ఈ చిత్రం ద్వారా అతడు మరోసారి హిట్ ట్రాక్ ఎక్కేశాడు.


Click it and Unblock the Notifications











