IFFI2023 మాధురీ దీక్షిత్‌కు అరుదైన గుర్తింపు.. IFFI వేడుకల్లో అత్యుత్తమ అవార్డు!

బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ గురించి భారత దేశ సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1984వ సంవత్సరం నుంచి నేటికీ సినీ రంగంలో కొనసాగుతూ దుమ్మ రేపుతోంది మాధురీ దీక్షిత్. 56 ఏళ్ల వయసులోనూ.. చాలా యంగ్ అండ్ ఫిట్ గా కనిపిస్తూ రచ్చ చేస్తోంది. ఇప్పటికే అద్భుతమైన చిత్రాల్లో నటించి విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఈమెకు.. తాజాగా మరో గుర్తింపు లభించింది. 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా.. మాధురీ దీక్షిత్ భారతీయ సినీ రంగానికి ఆమె అందించిన సేవలకు గాను ప్రత్యేకంగా గుర్తించింది.

గోవాలో ఈ రోజు జరిగిన 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ప్రారంభోత్సవం జరిగింది. ఈ వేడుకల్లో ముఖ్యంగా కేంద్ర సమాచార, ప్రసారాలు మరియు యువజన వ్యవహారాల, క్రీడల శాఖా మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్‌తో పాటు ఇన్ఫర్మేషన్ & బ్రాడ్‌కాస్టింగ్ డాక్టర్. ఎల్. మురుగన్ లు హాజరు అయ్యారు. అలాగే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈక్రమంలోనే ఆ వేడుకలకు వచ్చిన హీరోయిన్ మాధురీ దీక్షిత్ కు నిర్వాహకులు అరుదైన గుర్తింపు ఇచ్చి సత్కరించారు.

 Madhuri Dixit Honoured With Special Recognition in IFFI 54th Celebrations

నాలుగు దశాబ్దాలుగా మాధురీ దీక్షిత్ హీరోయిన్ గా, ప్రత్యేక గీతాల్లో నటిస్తూ, స్పెషల్ అప్పీయరెన్స్ ఇస్తూ వస్తున్నారు. ముఖ్యంగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. అందుకే ఆమె సినీ రంగానికి చేసిన సేవలు గుర్తించినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. ఇదే విషయాన్ని వివరిస్తూ.. ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ కూడా పెట్టారు. మాధురీ దీక్షిత్ వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సుల వారికి ఐకాన్ లా మారారని.. నాలుగు దశాబ్దాలుగా అసమానమైన ప్రతిభతో ప్రేక్షకులను అలరించారని వివరించారు.

 Madhuri Dixit Honoured With Special Recognition in IFFI 54th Celebrations

వైవిధ్యమైన పాత్రల్లో నటించి.. నటించి కాదు జీవించి ఆ పాత్రలకు ప్రాణం పోసిన మాధురీ దీక్షిత్ తరతరాలుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నారు. భారతీయ సినీ రంగానికి ఆమె చేసిన సేవలు గుర్తించి ప్రభుత్వం అవార్డు ఇవ్వడం.. ఆమె అసమానమైన ప్రతిభకు గుర్తింపు అనే చెప్పొచ్చు. 1980లు, 90లు మరియు 2000ల ప్రారంభంలో హిందీ సినిమాల్లో అద్భుతమైన నటనా ప్రతిభను ప్రదర్శించారు. అలా మాధురీ దీక్షిత్ ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకున్నారు. అలాగే రికార్డు స్థాయిలో పద్నాలుగు సార్లు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేట్ అయ్యారు.

 Madhuri Dixit Honoured With Special Recognition in IFFI 54th Celebrations

1984లో మాధురీ దీక్షిత్ "అబోద్" సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కొన్ని సినిమాల్లో సహాయ నటిగా చేశారు. "తేజాబ్" సినిమాలో ముఖ్య నటి పాత్ర పొషించారు. ఈ సినిమా అమెకి పేరునే కాకుండా తన మొదటి ఫిలింఫేర్ నామినేషన్ ని కూడా తెచ్చి పెట్టింది. ఆపై ఆమె "రాం లఖన్" (1989), "పరిందా" (1989), "త్రిదేవ్" (1989), "కిషన్ కన్హయ్యా" (1990) వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. అలాగే 2014లో మాధురీ దీక్షిత్ భారతదేశంలో UNICEF గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X