twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కూలీలు సబ్బుకు కూడా ట్యాక్స్ కడుతున్నారు.. నీవు కట్టలేవా? కారు కొనుగోలు కేసులో ధనుష్‌పై కోర్టు ఆగ్రహం

    |

    నటుడు విజయ్ తన రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు కోసం ఎంట్రీ టాక్స్ మినహాయింపు కోరుతూ రిట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల మద్రాస్ హైకోర్టు అతనిపై తీవ్రంగా విరుచుకుపడింది. విజయ్ ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకున్న రోల్స్ రాయిస్ కారు కోసం ఎంట్రీ టాక్స్ మినహాయింపు కోరుతూ 2012 లో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. అలాగే 2015లో మరో నటుడు ధనుష్ కూడా అదే తరహాలో మరొక పిటిషన్ ను దాఖలు చేయగా ప్రస్తుతం ఆ వివాదంపై కోర్టులో చర్చలు జరుగుతున్నాయి. ధనుష్ పై కూడా న్యాయస్థానం మొట్టి కాయలు వేసింది.

    ట్యాక్స్ కట్టాలని మొట్టికాయలు

    ట్యాక్స్ కట్టాలని మొట్టికాయలు

    సాధారణంగా ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే ఖరీదైన కారును కొనుగోలు చేసినప్పుడు అందుకు సంబంధించిన టాక్స్ చెల్లింపులను క్లియర్ చేసుకోవాలని న్యాయస్థానం ఇటీవల మరోసారి ఆదేశాలు జారీ చేసింది. విజయ్ కేసుపై పై వివరణ ఇస్తూ ఎవరైనా సరే తప్పకుండా రూల్స్ ప్రకారం టాక్స్ కట్టాలని మొట్టికాయలు వేసింది. ఇక మరో సారి ధనుష్ కు కూడా అదే తరహాలో కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

    కోర్టును ఆశ్రయించక తప్పలేదు

    కోర్టును ఆశ్రయించక తప్పలేదు

    మంగళవారం ధనుష్ కేసు విచారణలోకి రావడంతో జస్టిస్ S.M. సుబ్రహ్మణ్యం గురువారం ఆర్డర్లు జారీ చేయడం కోసం ఎంట్రీ టాక్స్ మినహాయింపు కోరుతూ, మరో రిట్ పిటిషన్‌తో పాటు ధనుష్ కేసును నమోదు చేయాలని ఆదేశించారు. గురువారం 'ఫర్ ఆర్డర్‌ల' శీర్షిక కింద రెండు కేసులను జాబితా చేయాలని కోర్టు అధికారిని ఆదేశించారు. ఇక ప్రాంతీయ రవాణా అధికారి దిగుమతి చేసుకున్న కారును నమోదు చేయడానికి ముందు వాణిజ్య పన్నుల శాఖ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం పట్టుబట్టడంతో ధనుష్ కోర్టును ఆశ్రయించక తప్పలేదు.

    కూలి పనులు చేసుకునే వారు సబ్బుకు పన్ను కడుతున్నారు

    కూలి పనులు చేసుకునే వారు సబ్బుకు పన్ను కడుతున్నారు

    న్యాయ స్థానం ధనుష్ ఇచ్చిన వివరణ ప్రకారం రోజు కూలి పనులు చేసుకునే వారు కూడా కొనుక్కునే సబ్బుకు కూడా పన్ను కడుతున్నారు. అలాంటిది మీరు ఈ స్థాయిలో ఉండి రూల్స్ ప్రకారం పన్ను కట్టడానికి అభ్యంతరం ఏమిటని జస్టిస్ ప్రశ్నించారు. అలగెబ్50 రూపాయలకు పెట్రోల్ కోసం సాధారణ ప్రజలు కూడా పన్నులు చెల్లిస్తారు. మీరు హెలికాప్టర్ కూడా కొనండి, కానీ దానిపై పన్ను చెల్లించకపోవడం ఆమోదయోగ్యం కాదుని కూడా జస్టిస్ S.M. సుబ్రమణ్యం తెలిపారు.

    కారు గాలిలో ఎగురుతుందా?

    కారు గాలిలో ఎగురుతుందా?

    అంతేకాకుండా ధనుష్ పై అసంతృప్తితో న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. దేశంలో రోడ్డు పై ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరూ టాక్స్ పడుతున్నారని.. ప్రజలు పన్ను డబ్బులు వేసిన చోట మీరు కారును నడపబోతున్నారు కదా అంటూ.. మీరు విదేశాల నుంచి కారును కొనుగోలు చేస్తే గాలిలో ఎగురుతుందా? అంటూ న్యాయస్థానం బలమైన ఉదాహరణలతో ప్రశ్నించింది. జస్టిస్ S.M. సుబ్రమణ్యం ధనుష్ కేసు విషయంలో తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం రూల్స్ ప్రకారం పన్ను చెల్లించాలని మొట్టికాయలు వేసింది

    ట్యాక్స్ చెల్లింపుకు ధనుష్ గ్రీన్ సిగ్నల్

    ట్యాక్స్ చెల్లింపుకు ధనుష్ గ్రీన్ సిగ్నల్

    ఈ కేసు విషయంలో హీరో ధనుష్ కూడా న్యాయస్థానం తీర్పుకు అంగీకరించక తప్పలేదు. తప్పకుండా సోమవారం లోగా మిగిలిన ట్యాక్స్ ను తప్పకుండా చెల్లిస్తానని న్యాయస్థానం ముందు వివరణ ఇచ్చాడు. దీంతో కోర్టు కూడా ధనుష్ వివరణకు సమ్మతించింది. ఇక ధనుష్ సినిమాల విషయానికి వస్తే అన్ని భాషలు కవర్ చేస్తూ.. హాలీవుడ్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. హిందీ తెలుగు తమిళ్ లో వరుసగా సినిమాలను లైన్ లో పెట్టాడు.

    ధనుష్ సినిమాల విషయానికి వస్తే

    ధనుష్ సినిమాల విషయానికి వస్తే

    ఇటీవల తెలుగులో డైరెక్టర్ శేఖర్ కమ్ములతో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అసురన్ కర్ణ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న ధనుష్ తర్వాత సినిమాలతో తన స్థాయిని మరింత పెంచుకోవాలని సరైన కథల్ని ఎంచుకుంటున్నాడు. హాలీవుడ్ సినిమా ఇప్పటికే సగానికిపైగా పూర్తయింది. అలాగే బాలీవుడ్ లో ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తో కూడా ఒక డిఫరెంట్ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.ఆ సినిమాపై ఇటీవల ఆఫీషియల్ గా క్లారిటీ కూడా ఇచ్చారు.

    Recommended Video

    HC Asks Amazon To Take Down Nani's V Movie film | Sakshi Malik | Filmibeat Telugu
    హిట్టు దర్శకుడితో మరోసారి..

    హిట్టు దర్శకుడితో మరోసారి..

    పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోయే ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి రానుంది. లవ్ స్టోరీ సినిమా నిర్మించిన సునీల్ ఆ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నారు. ఇటీవల తెలుగులో వచ్చిన నారప్ప సినిమా ధనుష్ అసురన్ కు రీమేక్ గా వచ్చిన విషయం తెలిసిందే. అయితే నారప్ప కంటే కూడా అసురన్ కు ఎక్కువ మార్కులు పడ్డాయి.

    నారప్ప చూసిన తర్వాత కూడా తెలుగు జనాలు మరోసారి ధనుష్ నటించిన అసురన్ సినిమాపై ఒక లుక్కేశారు. ఇక కర్ణన్ దర్శకుడు సెల్వ రాజ్ తో కూడా మరో సినిమా చేయాలని ధనుష్ నిర్ణయం తీసుకున్నాడు ఇటీవల ఒక కొత్త కథ పై ఇద్దరూ తరచుగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆ సినిమా కూడా వచ్చే ఏడాది చివర్లో మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    English summary
    Madras High Court has ordered Dhanush to pay the entry tax in luxury car case. Judge condemned the star with serious questions.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X