మద్రాసి గ్యాంగ్‌కు మంచు మనోజ్ సపోర్ట్.. ఒక్కడు మిగిలాడు సంస్థలో..
పద్మజ ఫిలింస్ ఇండియా ప్రైవేట్ లిమెటెడ్ పతాకంపై ఎస్.ఎన్ రెడ్డి రూపొందిస్తున్న చిత్రం మద్రాసి గ్యాంగ్. తెలుగు,హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఒక్కడు మిగిలాడు ఫేమ్ అజయ్ ఆండ్రూస్ నూతంకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. హీరో మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత ఎస్.ఎన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంతకుముందు హీరో మంచుమనోజ్‌తో మా బ్యానర్‌లో వచ్చిన ఒక్కడు మిగిలాడు మూవీకి మంచి ప్రశంసలు దక్కాయి. మళ్లీ అజయ్ ఆండ్రూస్ నూతంకి దర్శకత్వంలో మరో సినిమా తీస్తున్నాం. క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 13 నుంచి ప్రారంభమవుతుంది అని తెలిపారు. హిందీ, తమిళ, తెలుగు భాషల్లో భారీ స్థాయిలో నిర్మించబోతున్నాం. ప్రధాన పాత్రధారులుగా సంతోష్,రంగ జిను నటిస్తున్నారు అని ఎస్ఎన్ రెడ్డి తెలిపారు.

మద్రాసి గ్యాంగ్ సినిమా పూజా కార్యక్రమానికి హీరో మంచు మనోజ్ రావడం సంతోషంగా ఉంది. ఆయన కెమెరా స్విచ్చాన్ చేసి విషెస్ అందజేసినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్థతలు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకూమార్ ఈ మూవీ థీమ్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. అలాగే నటుడు సంపూర్ణేష్ బాబు తదితరులు వచ్చి విషెస్ తెలియజేశారు.వాళ్లందరికీ థాంక్స్ అని ఎస్ఎన్ రెడ్డి అన్నారు.
నటీనటులు: సంతోష్, రంగ జిను, తదితరులు.
టెక్నీషియన్స్: సినిమాటోగ్రఫీ: వి.కె రామరాజు
మ్యూజిక్: ఎన్.ఎస్ ప్రసు
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
ఆర్ట్ డైరెక్టర్ : శివ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్.వి.వి సత్యనారాయణ
లైన్ ప్రొడ్యూసర్స్: ధరణి కుమార్,రాధాకృష్ణ తాతినేని
నిర్మాత : ఎస్.ఎన్ రెడ్డి
రచన, దర్శకత్వం: అజయ్ ఆండ్రూస్ నూతంకి


Click it and Unblock the Notifications











