హీరోయిన్ పూర్ణకు బెదిరింపులు.. బయటపడుతున్న షాకింగ్ సీక్రెట్స్.. తెర వెనుక మాఫియా
ఇటీవల సౌత్ హీరోయిన్ పూర్ణకు బ్లాక్ మెయిల్ బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. భయంతో పోలీసులను ఆశ్రయించగా ఆ కేసు నుంచి అనేక రకాల విషయాల బయటపడుతున్నాయి. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో పూర్ణకి సంబంధించిన ఈ కేసు హాట్ టాపిక్ గా మారింది. దీని వెనుక పెద్ద మాఫియా ఉండవచ్చనే అనుమానాలు వస్తున్నాయి.

అవును హీరోయిన్..
రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన 'అవును' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల బాగా దగ్గరైన బ్యూటీ పూర్ణ. ఈ బ్యూటీ అసలు పేరు షమ్నా ఖాసిం. గత కొన్నేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న పూర్ణ కాంట్రవర్సీలకు చాలా దూరంగా ఉంటుంది. అయితే ఇటీవల ఆమె తల్లి కేరళ పోలీసులను సహాయం కోరడం వైరల్ అవుతోంది.

గతంలో కూడా..
లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడమే కాకుండా బ్లాక్ బెయిల్ చేస్తూ బెదిరింపులకు పాల్పడం వెనుక అసలు కారణం ఏమై ఉంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కూడా ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకొని విచారిస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా కేరళలో కొంతమంది స్టార్స్ ని బ్లాక్ మెయిల్ మెయిల్ చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి.

మాఫియా అనుమానాలు..
ఇక ఇప్పుడు పూర్ణతో పాటు మరికొంత మందిని బ్లాక్ బెయిల్ చేయాలని దుండగులు ప్లాన్ చేసుకున్నట్లు అనుమానాలు వస్తున్నాయి. అంతే కాకుండా ఈ వివాదం వెనుక ఒక పెద్ద మాఫియనే ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇదే తరహాలో కొందరు మోసపోయిన ఘటనలు కూడా బయటపడ్డాయి.
Recommended Video

దీని వెనుక ఎవరున్నారు?
ఇక పూర్ణపై జరిగిన ఘటనతో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. స్పెషల్ గా సినీ తారలకు ఇలాంటి బెదిరింపులు ఎందుకు వస్తున్నాయి? దీని వెనుక ఎవరు ఉన్నారనే విషయాలని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే కేసు విషయంలో మరొక క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











