మహాశివరాత్రి స్పెషల్ షోలు.. 12 బ్లాక్ బస్టర్ హిట్ మూవీలు రీరిలీజ్.. ఏ చిత్రం ఎక్కడ చూడాలంటే?
మహాశివరాత్రి పండుగ సందర్భంగా అదిరిపోయే స్పెషల్ షోలు వేస్తున్నారు. గతంలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన అనేక సినిమాలను రీరిలీజ్ చేస్తూ.. జాగారం చేసే వాళ్లకు స్పెషల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. అయితే హైదరాబాద్ లో శివరాత్రి పండుగ సందర్భంగా రాబోతున్న స్పెషల్ సినిమాలు ఏంటి, వాటిని ఎప్పుడు ఏయే థియేటర్లో విడుదల చేయబోతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన అదుర్స్ సినిమాను మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు దేవి 70 ఎంఎం థియేటర్లో విడుదల చేయబోతున్నారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో 2010లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాగే నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన దసరా సినిమాను.. శ్రీకృష్ణ, మహాలక్ష్మి కాంప్లెక్స్ లలో విడుదల చేయబోతున్నారు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.

అలాగే మాస్ మహారాజా రవితే హీరోగా వచ్చిన ధమాకా సినిమాను హైదరాబాద్ లోని మహాలక్ష్మి కాంప్లెక్స్ లో శివరాత్రి పండుగ సందర్భంగా స్పెషల్ షో వేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేసిన డీజే టిల్లు సినిమాను కూడా హైదరాబాద్ లోని మహాలక్ష్మి కాంప్లెక్స్ లో స్పెషల్ షోగా వేయబోతున్నారు. విమల్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

అలాగే ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజా సజ్జా హీరోగా వచ్చిన హనుమాన్ సినిమాను కూడా అలాగే ఉంచనున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా ఏయే థియేటర్లలో ఉందో అక్కడ ఈ చిత్రాన్ని ఈరోజు కూడా ప్రదర్శించబోతున్నారు. అలాగే యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ హీరోగా వచ్చిన కార్తికేయ 2 చిత్రాన్ని మహాలాక్ష్మి కాంప్లెక్స్ లో ప్రత్యేక షోగా వేయనున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో వ్చిన ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.
అలాగే మ్యాడ్ సినిమాను సప్తగిరి 70 ఎంఎంలో, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన రెబల్ సినిమాను సంద్య 35 ఎంఎంలో, ప్రభాస్ మరో సినిమా సలార్ ను నత్రకి, సుష్మ 2కే చిత్రాలను స్పెషల్ షోలుగా వేయబోతున్నారు. అలాగే నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా చేసిన వీరసింహారెడ్డి సినిమాను సుదర్శన్ 35 ఎంఎం, మాస్ మహారాజా రవితేజ హీరోగా చేసిన వెంకీ సినిమాను కూడా సంధ్య 70 ఎంఎంలో ప్రత్యేక షోగా వేయబోతున్నారు.

ఇది మాత్రమే కాకుండా మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన వాల్తేరు వీరయ్య చిత్రాన్ని సంధ్య 70 ఎంఎం థియేటర్ లో ప్రదర్శించబోతున్నారు. ఇందులో మీకు నచ్చిన ఏ సినిమా అయినా సరే ఈరోజు ఆయా థియేటర్లకు వెళ్లి హ్యాపీగా చూసేయండి. పుల్ గా ఎంజాయ్ చేసేయండి. ఇంకా ఎందుకు ఆలస్యం.


Click it and Unblock the Notifications











