Maharaja Twitter Review విజయ్ సేతుపతి యాక్టింగ్ వావ్.. మహరాజా మూవీ ఎలా ఉందంటే?
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన తాజా చిత్రం మహారాజా. తన కెరీర్‌లో 50 చిత్రంగా రూపొందిన ఈ సినిమాకు నాతిలాన్ దర్శకత్వం వహించారు. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం జూన్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందనే విషయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు వెల్లడించిన అభిప్రాయాలు మీ కోసం..

మహారాజా మూవీ చాలా బాగుంది. థియేటర్లలో కుటుంబ సమేతంగా కచ్చితంగా చూడాల్సిన సినిమా. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అత్యంత బలం. స్టోరీ చెప్పిన విధానం ఫస్టాఫ్‌కు బలం. సెకండాఫ్‌ను దర్శకుడు ఎమోషన్స్ దట్టించి అదరగొట్టారు. విజయ్ సేతుపతి యాక్టింగ్, నితిలాన్ దర్శకత్వం, అనురాగ్ కశ్యప్ పెర్ఫార్మెన్స్, సినిమాటోగ్రఫి తదితర అంశాలు సూపర్‌గా ఉన్నాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
మహారాజా సినిమా మూవీ లక్ష్మీ ఎవరు అనే పాయింట్‌తో మొదలువుతుంది. ఫస్టాఫ్‌లో కామెడీ, సస్పెన్స్ పాజిటివ్ అంశాలు. విజయ్ సేతుపతికి ఇది కమ్ బ్యాక్ మూవీ. అనురాగ్ కశ్యప్ యాక్టింగ్ చూస్తే థ్రిల్ అవ్వడమే కాకుండా నోటి నుంచి మాట కూడా రాదు. ఈ సినిమాలో నటించిన వారందరూ అద్బుతంగా ఫెర్ఫార్మ్ చేశారు అని నెటిజన్ కామెంట్ చేశాడు.
మహారాజా మూవీ ఫస్టాఫ్ చాలా బాగుంది. విజయ్ సేతుపతికి పర్‌ఫెక్ట్ కమ్ బ్యాక్. ఫస్టాఫ్ కామెడీతో ప్యాక్ అయిపోయింది. ఇంటర్వెల్‌లో థ్రిల్లింగ్ సీన్స్, యాక్షన్ సూపర్. మహరాజాగా విజయ్ సేతుపతి క్యారెక్టరైజేషన్ బాగుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
ప్రస్తుతం జనరేషన్‌లో నటుడిగా ఎవరైనా ఉన్నారంటే.. అది వన్ అండ్ ఓన్లీ విజయ్ సేతుపతి. ఆయనకు 50 చిత్రంగా మహరాజా బెస్ట్ మూవీ. దర్శకుడు నితిలాన్ సూపర్బ్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్‌తో ఆకట్టుకొన్నాడు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో బెస్ట్ మూవీ. అనురాగ్ కశ్యప్ యాక్టింగ్ బాగుంది అని నెటిజన్ కామెంట్ చేశాడు.
మహారాజా సినిమా విషయానికి వస్తే.. ఫస్టాఫ్‌లో సస్పెన్స్ చాలా చక్కగా బిల్డ్ చేశాడు. సెకండాప్‌లో ట్విస్టుతో అదరగొట్టాడు. సెకండాఫ్‌లో తన ప్రతిభ ఏంటో దర్శకుడిగా నితిలాన్ చాటుకొన్నాడు. ఎమోషన్స్, హ్యుమర్, సస్పెన్స్ మిక్స్ చేసి తెరకెక్కించిన విధానం బాగుంది అని ఓ నెటిజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











