For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మహర్షి’ రికార్డుల మోత షురూ... యూఎస్ఏలో ‘బాహుబలి 2’ రికార్డ్ బద్దలు!

    |
    Maharshi Smashed Bahubali 2 Records In USA || Filmibeat Telugu

    సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న 'మహర్షి' చిత్రం రిలీజ్ ముందే పలు సంచలన రికార్డులు నమోదు చేస్తోంది. తాజాగా ఓవర్సీస్ ప్రీమియర్ షోల విషయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ రికార్డ్ సొంతం చేసుకోవడంతో పాటు బాహుబలి 2 రికార్డును సైతం బద్దలు కొట్టబోతోంది.

    మహేష్ బాబు నటించిన అతడు, ఆగడు, పోకిరి, భరత్ అనే నేను చిత్రాలను యూఎస్ఏలో డిస్ట్రిబ్యూట్ చేసిన గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ తాజాగా 'మహర్షి' డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకుంది. మహేష్ బాబు సినిమాలకు విదేశీ మార్కెట్లో మంచి క్రేజ్ ఉండటంతో ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.

    2500లకుపైగా ప్రీమియర్ షోలు

    2500లకుపైగా ప్రీమియర్ షోలు

    యూఎస్ఏ వ్యాప్తంగా ‘మహర్షి' చిత్రాన్ని 260 లొకేషన్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మహేష్ బాబు కెరీర్లోనే ఇది హయ్యెస్ట్ రికార్డ్. మహేష్ బాబు మేనియాను క్యాష్ చేసుకునేందుకు ఇండియా కంటే ఒకరోజు ముందు మే 8వ తేదీన ఓవర్సీస్ మార్కెట్లో దాదాపు 2500 షోలు ప్రదర్శిస్తున్నారు.

    కలెక్షన్ల పరంగా బాహుబలి 2ను మించిపోతుందా?

    కలెక్షన్ల పరంగా బాహుబలి 2ను మించిపోతుందా?

    ‘బాహుబలి 2' చిత్రాన్ని అప్పట్లో దాదాపు 2000 ప్రీమియర్ షోలు వేశారు. ఇండియన్ ఫిల్మ్ చరిత్రలోనే ఇది హయ్యెస్ట్. ఇపుడు ‘మహర్షి' ఆ రికార్డ్ బద్దలు కొట్టడమే కాదు... రాబోయే సినిమాలకు పెద్ద బెంచ్ మార్క్ సెట్ చేసి పెట్టింది. అప్పట్లో బాహుబలి ప్రీమియర్ షోల ద్వారా 3 మిలియన్ డాలర్ వసూలు చేసింది. మరి ‘మహర్షి' ఆ రికార్డ్ బద్దలు కొడుతుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

    భారీగా అడ్వాన్స్ బుకింగ్

    భారీగా అడ్వాన్స్ బుకింగ్

    ‘మహర్షి' యూఎస్ఏ ప్రీమియర్ షోలకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ మే 3వ తేదీనే మొదలైంది. కొన్ని లొకేషన్లలో టికెట్స్ మీద ఆఫర్స్ కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల డిస్కౌట్లు అందుబాటులో ఉన్నట్లు గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఇప్పటికే దాదాపు సగం టిక్కెట్లు అమ్ముడైనట్లు సమాచారం. మే 8వ తేదీ వరకు అన్ని చోట్లా హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చే అవకాశం ఉంది.

    ఓవర్సీస్ రైట్స్ ఎంతకు అమ్మారు?

    ఓవర్సీస్ రైట్స్ ఎంతకు అమ్మారు?

    మహేష్ బాబు గత చిత్రం ‘భరత్ అనే నేను' ఓవర్సీస్ మార్కెట్లో లైఫ్ టైమ్ రన్‌లో రూ. 30 కోట్ల గ్రాస్ వసూలు చేయడంతో పాటు రూ. 16 కోట్ల షేర్ రాబట్టింది. అయితే అప్పట్లో ఆ సినిమాకు రూ. 18.50 కోట్లు ఇన్వెస్ట్ చేయడంతో వర్కౌట్ కాలేదని టాక్. ‘మహర్షి' సినిమాను రూ. 18 కోట్లు దిల్ రాజు బేరం పెట్టారని, ఎవరూ అంత భారీ మొత్తం పెట్టడానికి ముందుకు రాక పోవడంతో గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ రూ. 14 కోట్లకు డీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Great India Films has planned to release Maharshi in 260 locations across the US and it is the highest number for a film starring Mahesh Babu. The distributors are holding 2,500 premiere shows to cash in on the Mahesh mania in the county on May 8, a day before it hits the screens in India. They tweeted on May 2 "#MAHARSHI 2500+ SHOWS OVERSEAS ON May 8th."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X