మహర్షి మూవీ సెకండాఫ్ హైలెట్స్.. ఫెర్ఫార్మెన్స్‌తో కుమ్మేసిన మహేష్!
'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను'లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత సూపర్‌స్టార్ మహేష్, సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో.. వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్ వేల్యూస్, పవర్‌ఫుల్ సోషల్ మెసేజ్‌తో రూపొందిన భారీ చిత్రం 'మహర్షి'. సూపర్‌స్టార్ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. పూజా హెగ్డే హీరోయిన్. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. మహర్షి చిత్రంలో హైలెట్ పాయింట్స్ ఇవే...

యూఎస్ టూ గోదావరి జిల్లాలోని
యూఎస్‌లో ఉద్యోగం వదిలి గోదావరి జిల్లాలోని రామవరం గ్రామానికి రిషి చేరుకోవడంతో సినిమా సీరియస్ నోట్‌లో వెళ్లుంది. మహేష్ ఫెర్మార్మెన్స్ పీక్స్‌లో ఉంటుంది. కథలోకి వివేక్ మిట్టల్ పాత్రతో జగపతిబాబు ఎంటర్ అవుతాడు.

భూసేకరణ ఉద్యమం కీలకంగా
తన గ్రామంలో నరేష్ భూసేకరణ కోసం ఉద్యమం చేస్తుండటం కథకు కీలకంగా మారుతుంది. జగపతిబాబు, రిషికి మధ్య పోటాపోటీగా సన్నివేశాలు సినిమాకు హైలెట్‌గా ఉంటాయి. ఈ సీన్లు సినిమాను మరో మలుపు తిరగడానికి కారణమవుతాయి. నరేష్ తన గ్రామంలో ఓ కంపెనీ పెడుతాడు. ఫిర్ షూరూ అనే పాట ఎమోషనల్‌గా సాగుతుంది.

రిషి, పూజా ఫీల్ గుడ్ రొమాన్స్
కథలో భాగంగా పూజా హెగ్డే కూడా రామవరంలోకి ఎంటర్ అవుతుంది. విద్యుల్లేఖ క్యారెక్టర్ కథలో అదనంగా యాడ్ అవుతుంది. కథ ఓవైపు ఎమోషనల్ సాగుతూనే మరో పక్క రిషి, పూజాల మధ్య రొమాన్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ సాగుతుంది. ఈ క్రమంలోనే పాలపిట్ట పాట హుషారుగా సాగుతుంది.
.

జగపతి బాబు ఎంట్రీతో
జగపతి బాబు, నరేష్, మహేష్ మధ్య సన్నివేశాలు సీరియస్‌గా సాగుతుంటాయి. విలన్ టచ్ ఉన్న మరో పాత్ర రాజీవ్ కనకాల రూపంలో ఎంట్రీ ఇస్తుంది. ఓ మాస్ ఫైట్ ప్రేక్షకులను గూస్ బంప్స్‌ను కలుగజేసేలా ఉంటుంది. మరోసారి జగపతిబాబు విజృంభించి నటించాడని చెప్పవచ్చు

భావోద్వేగంతో కథకు ఎండింగ్ టచ్
కథలో ఎమోషన్స్, సీరియస్ సన్నివేశాల మధ్య మహేష్ రైతుగా మారుతాడు. ఇదే కదా నీ కథ అనే పాట సినిమాకు భావోద్వేగాన్ని నింపేలా ఉంటుంది. రైతుల కోసం మహేష్ పోరాటం పవర్ ఫుల్ పాయింట్‌గా మారింది. ఓ భావోద్వేగమైన అంశంతో సినిమా ప్రేక్షకుడిని టచ్ చేస్తూ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











