twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహర్షి మేకింగ్ వీడియో.. సెట్స్‌పై మహేష్ బాబు ఎంత చురుకో..

    |

    Recommended Video

    Maharshi Making Video Is Out, Eye Feast For Mahesh Babu For Fans || Filmibeat Telugu

    వంశీ పైడిపెల్లి దర్శకత్వంలో మహేష్ సిల్వర్ జూబ్లీ సినిమాగా మహర్షి ప్రేక్షకుల ముందుకొచ్చింది. దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే చిందులేయగా.. అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. ఎపిక్ బ్లాక్‌బస్టర్‌గా రికార్డులను తిరగరాస్తూ విజయవంతంగా ప్రదర్శించబడుతోంది మహర్షి మూవీ. ఈ నేపథ్యంలో మహర్షి మేకింగ్ వీడియో రూపంలో మరో ట్రీట్ ఇచ్చింది చిత్రయూనిట్.

    సెట్స్‌పై మహేష్ బాబు

    తాజాగా మహర్షి మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో సెట్స్ మహేష్ బాబు చురుకుదనం చూసి ఫిదా అవుతున్నారు ఆయన అభిమానులు. ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం యాక్షన్ అనే ఒక్క డైలాగ్.. ఆకట్టుకునే మ్యూజిక్ నడుమ మహర్షి మేకింగ్ మూవ్ మెంట్స్ చాలా అట్రాక్టివ్‌గా ఉండేలా ఈ వీడియో రూపొందించారు.

    దేశ విదేశాల్లో.. నమ్రత సహా కొడుకు కూతురు

    దేశ విదేశాల్లో.. నమ్రత సహా కొడుకు కూతురు

    ఈ వీడియోలో దేశ విదేశాల్లోని పలు అందమైన లొకేషన్స్‌లో తీసిన సన్నివేశాల మేకింగ్ క్లిపింగ్స్ చూపించారు. మహేష్ షూటింగ్ లొకేషన్స్‌లో ఆయనతో పాటు మహేష్ భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సిరాత కనిపించారు. వంశీ పైడిపెల్లి టేకింగ్ స్టైల్ ఈ వీడియోలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది.

    ఓ పక్క కలెక్షన్ల సునామీ.. మరో పక్క హంగామా

    ఓ పక్క కలెక్షన్ల సునామీ.. మరో పక్క హంగామా

    మహేష్ బాబు కెరీర్‌లో 25 వ సినిమాగా రూపొందిన మహర్షి సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికీ 150 కోట్ల మార్క్ దాటేసిన ఈ సినిమా 200 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. దీంతో ఆనందోత్సహాల్లో మునిగి తేలుతున్న చిత్రయూనిట్ ఇప్పటికే విజయవాడ వేదికగా సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించింది. సక్సెస్ జోష్‌లో భాగంగా మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి మరోసారి వెకేషన్‌కి వెళ్లారు.

    వెకేషన్ నుంచి రాగానే..

    వెకేషన్ నుంచి రాగానే..

    ఈ సారి వెకేషన్ కోసం మహేష్ ఏకంగా 20 రోజులు కేటాయించడం విశేషం. వేసవి ముగుస్తుండటంతో తన భార్య పిల్లలతో కలిసి యూరోప్ టూర్ వేశారు మహేష్. ఈ వెకేషన్ నుంచి తిరిగి రాగానే ఆయన తన 26 వ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనుండగా.. రష్మిక మందన్న మహేష్ సరసన ఆడిపాడనుంది. అలాగే విజయశాంతి ఈ సినిమాతోనే తెరపైకి రీ ఎంట్రీ ఇవ్వనుండటం విశేషం.

    English summary
    Mahesh babu's Maharshi movie running successfully. This movie success celebrations held at vijayawada recently. Now the Maharshi making vedio has come out.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X