ఈ సీన్ ఉంటే ‘మహర్షి’ ఎలా ఉండేదో? డిలీటెడ్ సీన్ రిలీజ్ చేసిన దిల్ రాజు
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన 'మహర్షి' చిత్రం మే 9న విడుదలై సంచలన విజయం అందుకుంది. మహేష్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం 100 రోజులు పూర్తయిన సందర్భంగా నిర్మాత దిల్ రాజు ఎడిటింగులో కట్ చేసిన ఓ సీన్ రిలీజ్ చేశారు.
దాదాపుగా మూడున్నర నిమిషాల నిడివిగల ఈ సీన్లో ఓ చిన్న ఫైట్ సీక్వెన్స్ కూడా ఉండటం గమనార్హం. ఈ సీన్ ఉంటే నిడివి కాస్త ఎక్కువ అయ్యేది. సినిమా కాస్త లాగినట్లు అయ్యేది. పెద్దగా ప్రాముఖ్యత లేని ఈ సీన్ తొలగించి మంచి పని చేశారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కాలేజీ బ్యాక్ డ్రాపులో వచ్చే ఈ సీన్ మొత్తం మహేష్ బాబు, కమల్ కామరాజు మధ్య సాగింది. మహేష్ బాబు చదువులో తనకంటే ముందు ఉండటం, అమ్మాయిలకు ఫేవరెట్ అవ్వడం తట్టుకోలేని టాప్ ర్యాంకర్ కమల్ కామరాజు దాడి చేయడం, దానికి హీరో తగిన గుణపాఠం చెప్పడం, ఆ తర్వాత ఈ గొడవ ప్రిన్సిపల్ వరకు వెళ్లడం చూపించారు.
రేయ్ నీ కన్‌ఫ్యూజన్ ఏంటి? ప్రాబ్లం సాల్వ్ చేశాననా? అమ్మాయిలతో తిరుగుతున్నాననా? క్లారిటీ తెచ్చుకో అని మహేష్ బాబు అనడం..... చదువునే నమ్ముకుని నువ్వు ఇక్కడి వరకు వచ్చావ్, అన్నీ ఉండి కూడా టాప్ ర్యాంకర్‌గా నేను ఇక్కడికి వచ్చాను. నీకే అంతుంటే నాకెంత ఉండాలి, నెవ్వేమైనా హీరో అనుకుంటున్నావా? అని కామరాజు బదులివ్వడం... నేను హీరోనేగా అంటూ మహేష్ కౌంటర్ ఇవ్వడం లాంటి సన్నివేశాలు ఇందులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











