మహేష్ బాబు పాత్రలో వేరియేషన్స్ చూసి షాకవుతారు: వంశీ పైడిపల్లి

మహేష్‌ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పి.వి.పి సినిమా పతాకాలపై రూపొందుతోన్న భారీ చిత్రం 'మహర్షి'. మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్‌. అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించిన చిత్ర బృందం మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా దర్శకుడు వంశీ పైడిపల్లి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. 'నేను కథ చెప్పినపుడు అది మహేష్ బాబు 25వ సినిమా అవుతుందని తెలియదు. ఊపిరి మూవీ అయిపోయిన నెల రోజులకే ఒక లైన్ చెప్పాను. తర్వాత 6 నెలలకు కథ చెప్పాను.'' అన్నారు.

మనలో ప్రతి ఒక్కరి కథ ఇందులో ఉంటుంది

మనలో ప్రతి ఒక్కరి కథ ఇందులో ఉంటుంది

‘అభిమానులకు ఒక విషయం మాత్రం చెప్పగలను. మహేష్ బాబు కెరీర్లో ఇది ఎప్పటికీ గుర్తుండి పోయే ల్యాండ్ మార్క్ చిత్రం అవుతుంది. ఈ సినిమాలో నా జీవితం ఉంటుంది, మీ జీవితం ఉంటుంది, ప్రతి ఒక్కరి జీవితం ఉంటుంది. సక్సెస్ అనేది డెస్టినేషన్ కాదు... అది ఒక ప్రయాణం. మనం రోజూ ఉదయం లేస్తే బయట అడుగు పెట్టేది విజయం కోసమే. అందుకే ఇది అందరి స్టోరీ ప్రతిబింభించే చిత్రం.'' అని వంశీపైడిపల్లి తెలిపారు.

నేను నమ్మిందే రాయమని చెప్పారు

నేను నమ్మిందే రాయమని చెప్పారు

‘‘మహేష్ బాబుకు నేను కథ చెప్పినపుడు కూడా మీరు ఏం నమ్ముతున్నారో అదే రాయండి, హీరోను దృష్టిలో పెట్టుకుని రావద్దు అన్నారు. కానీ మేము కథ రాసేపుడు ఆయన స్టార్ డమ్ కూడా మా ఆలోచనలో ఉంటుంది. ప్రజల్లో ఎన్నో అంచనాలు ఉంటాయి. నేను టికెట్ కొనుక్కుని వెళుతున్నానంటే ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. దానికి తగిన విధంగానే స్క్రిప్టులో స్టార్ డమ్ ఎలివేట్ చేస్తాం.'' అన్నారు.

వేరియేషన్స్ చూసి షాకవుతారు

వేరియేషన్స్ చూసి షాకవుతారు

‘‘మహేష్ బాబు లాంటి స్టార్ కాలేజ్ స్టూడెంట్ రోల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆ పాత్రలోకి తనను తాను మార్చుకున్న విధానం అద్భుతంగా ఉంటుంది. రేపు సినిమాలో ఆయన పాత్రలో వేరియేషన్స్ చూసిన షాకవుతారు'' అని వంశీ తెలిపారు.

సెట్స్‌లో అలా ఉండరు

సెట్స్‌లో అలా ఉండరు

మహేష్ బాబు ఎంతో స్టార్ డమ్ ఎచీవ్ చేసిన తర్వాత కూడా ఆయనలో డెడికేషన్, హార్డర్ వర్క్ అలాగే ఉంది. సెట్స్ లో ఎప్పుడూ సూపర్ స్టార్ మాదిరిగా ఉండరు. ఆయన నాపై పెట్టిన నమ్మకం, సపోర్ట్ వల్లే ఈ సినిమా సాధ్యమైందని పైడిపల్లి చెప్పుకొచ్చారు.

బ్రిలియంట్ యాక్టర్

బ్రిలియంట్ యాక్టర్

‘‘ఈ కథలో మరో పాత్రకు నరేష్ గారిని ఎందుకు ఎంచుకున్నానంటే ఆయన ఒక బ్రిలియంట్ యాక్టర్. నరేష్ మీద కామెడీ అనే లేబుల్ పడింది కానీ ఆయన పెంటాస్టిక్ యాక్టర్. గమ్యం, శంభో శివ శంభో సినిమాలు చూస్తే మీకు అర్థమవుతుంది. ‘మహర్షి' కథలో ఆయన పాత్రకు చాలా డెప్త్ ఉంటుంది, వారి ప్రెండ్షిప్‌కు ఒక కథ ఉంటుంది'' అని వంశీ పైడిపల్లి చెప్పుకొచ్చారు.

దిల్ రాజు మా అంకుల్

దిల్ రాజు మా అంకుల్

‘‘దిల్ రాజుగారితో సినిమాలు చేస్తూనే ఉంటారు. ఒకప్పుడు ఆయన డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులో సినిమా టిక్కెట్ల కోసం గంటలు తరబడి కూర్చునేవాడిని, ఆ జర్నీ ఇక్కడి వరకు వచ్చింది. బేసిగ్గా మేమంతా ఒక ఫ్యామిలీ. ఆయన్ను అంకుల్ అని పిలుస్తాను. మా జర్నీ కొనసాగుతూనే ఉంటుంది.'' అని వంశీ పైడిపల్లి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X