మహర్షి విడుదలపై మళ్ళీ అనుమానాలు!
సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. రైతు సమస్యల నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోంది. వంశీ పైడిపల్లి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అశ్విని దత్, దిల్ రాజు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజ హెగ్డే మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత అందిస్తున్నాడు. మహర్షి చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ చిత్ర విడుదల ఇప్పటికే ఓ సారి వాయిదా పడింది. ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని 25కు మార్చారు. ఈ తేదీ కూడా వాయిదా పడిందంటూ వార్తలు వచ్చాయి. కానీ ఏప్రిల్ 25నే ఖాయం చేస్తూ చిత్ర యూనిట్ ప్రకటన విడుదల చేసింది. అయినా కూడా మహర్షి విడుదలకు సంబంధించి అనుమానాలు ఆగడం లేదు.

మహర్షి చిత్ర విడుదల మే నెలకు వాయిదా పడబోతున్నట్లు సమాచారం. దీనిపై చిత్ర యూనిట్ ఇంకా స్పందించలేదు. విడుదల తేదికి సంబంధించి దిల్ రాజు మీడియా సమావేశం నిర్వహించబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ మీడియా సమావేశంలో మహర్షి చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తారట. మహర్షి చిత్రంలో అల్లరి నరేశ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











