ఆ భయంతోనే ఇక్కడిదాకా వచ్చా, ప్రపంచాన్ని ఏలేద్దామనుకుంటున్నా.. (మహర్షి ట్రైలర్)

సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పి.వి.పి సినిమా పతాకాలపై హై రూపొందుతోన్న భారీ చిత్రం 'మహర్షి'. మహేష్‌కు ఇది 25వ చిత్రం. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

మే 9న ప్రపంచవ్యాప్తంగా 'మహర్షి' చిత్రం విడుదలువుతున్న నేపథ్యంలో బుధవారం(మే 1) నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు.

ప్రపంచాన్ని ఏలేద్దామనే పాత్రలో మహేష్ బాబు

ప్రపంచాన్ని ఏలేద్దామనే పాత్రలో మహేష్ బాబు

ఏం సాధించాలనుకుంటున్నావ్ రిషి అంటే... ‘ప్రపంచాన్ని ఏలేద్దామనుకుంటున్నాను సర్' అంటూ మహేష్ బాబు చెప్పే డైలాగుతో ట్రైలర్ మొదలైంది. కట్ చేస్తే రిషి బిలియనీర్ మారిపోయాడు. ‘మనం గతంలో ఎక్కడ ఉన్నాం..ఇప్పుడు ఎక్కడ ఉన్నాం.. దాన్ని బట్టి మనకే అర్థమైపోతుంది మనం సక్సెస్ అయ్యామా? లేదా?' అంటూ చెప్పే డైలాగ్స్ బట్టి ఈ చిత్రంలో రిషి కాలేజీ చదువు పూర్తయ్యాక బాగా డబ్బు సంపాదించడమే లక్ష్యంగా విదేశాలకు వెళతాడని స్పష్టమవుతోంది.

అమ్మాయి కాఫీకి పిలిచిందని లైఫ్ రిస్కులో పెట్టలేం కదా

అమ్మాయి కాఫీకి పిలిచిందని లైఫ్ రిస్కులో పెట్టలేం కదా

కాలేజీలో మహేష్, పూజా, నరేష్ స్నేహితులుగా కనిపించారు. పూజా కాఫీకి రమ్మని అడిగితే... అందులో ఏదో కెమికల్ ఉంటుందట... అమ్మాయి కాఫీకి పిలిచిందని లైఫ్ రిస్కులో పెట్టలేం కదా అంటూ రిషి పాత్రలో మహేష్ బాబు వేసే సెటైర్లు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

మహేష్, అల్లరి నరేష్ మధ్య ఫన్నీ సీన్స్

మహేష్, అల్లరి నరేష్ మధ్య ఫన్నీ సీన్స్

నాలుగైదు బ్యాగులతో కాలేజీలోకి ఎంటరైన అల్లరి నరేష్... బరువు ఎక్కువగా ఉందని సాయం కోరగా ‘ఇక్కడ ఎవరి బరువు వాడే మోసుకోవాలి దొబ్బేయ్' అంటూ చెప్పడం, రూమ్మేట్‌గా ఉండే అతడిని మహేష్ బెదరించడం లాంటి సన్నివేశాలు ఫన్నీగా ఉన్నాయి.

తండ్రి కొడుల మధ్య అనుబంధం ఇలా...

తండ్రి కొడుల మధ్య అనుబంధం ఇలా...

రిస్క్ తీసుకుంటున్నావ్... ఉన్నది కూడా పోతుందేమో జాగ్రత్త అంటే... ‘ఓడిపోతామనే భయంతో ఆటలోకి దిగితే ఎప్పటికీ గెలవలేం' అని మహేష్ బాబు చెప్పే డైలాగులు రిషి పాత్ర తీరు ఎలా ఉండబోతోందో స్పష్టం చేస్తోంది. ‘‘గెలవడం అంటే సంపాదించడమేనా? అని తండ్రి(ప్రకాష్ రాజ్) చెప్పే మాటలకు రిషి రియాక్ట్ అవుతూ...‘‘ఇలా ఆలోచించుకుంటూ కూర్చుంటే నేను కూడా ఆయనలాగే అయిపోతాను' అని చెప్పే సీన్లు తండ్రి కొడుకుల మధ్య ఈ చిత్రంలో ఈక్వెషన్ ఎలా ఉంటుందో అర్థమవుతోంది.

ఆ భయంతోనే ఇక్కడి వరకు

ఆ భయంతోనే ఇక్కడి వరకు

‘‘ఇప్పటి వరకు నీకు గెలవడమే అలవాటు అనుకుంటా.. ఇప్పటి నుంచి ఓడి పోవడం కూడా అలవాటు చేసుకో... అంటూ జగపతి బాబు వాయిస్ సినిమాలో రివేంజ్ పార్ట్ ఎలా ఉంటుందో స్పష్టం చేస్తోంది. ‘‘చిన్నపుడు మా అమ్మకు చెప్పాను.. ఇపుడు నీకు చెబుతున్నాను... ఓడి పోవడం అంటే నాకు భయం. ఆ భయంతోనే ఇక్కడి వరకు వచ్చాను. మళ్లీ నాకు ఆ భయాన్ని పరిచయం చేస్తున్నావ్'' అంటూ మహేష్ కౌంటర్ ఇవ్వడం సినిమా క్లైమాక్స్ ఎలా ఉండబోతోందో ఊహించుకోవచ్చు.

ట్రైలర్ చివర్లో రైతుగా...

ట్రైలర్ చివర్లో మహేష్ బాబు రైతుగా కనిపించారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా విదేశాలకు వెళ్లిన రిషి... రైతుగా మారడం వెనక కారణం ఏమిటి? అనేది మే 9న విడుదలయ్యే సినిమాలో ఆసక్తికరంగా చూపించబోతున్నట్లు స్పష్టమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X