మహర్షి బ్లాక్‌బస్టర్.. అప్పుడే మాట్లాడుతాను.. అల్లరి నరేష్
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వైజయంతి మూవీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా బ్యానర్లపై అత్యాధునిక సాంకేతికతతో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం 'మహర్షి'. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. కమెడియన్ హీరో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. ఆటపాటలతో వేదిక హోరెత్తింది. సూపర్‌స్టార్ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం, అలాగే ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన అల్లరి నరేష్ మాట్లాడుతూ..
మహర్షి లాంటి పెద్ద సినిమా వేడుకలో పాల్గొనడం హ్యాపీగా ఉంది. మహేష్ బాబు లాంటి హీరోతో నటించడం చాలా సంతోషంగా ఉంది. దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ నాకు బాగా తెలుసు. ఈ సినిమా గురించి చాలా మాట్లాడాలని ఉంది. కానీ సక్సెస్ మీట్‌లో మాట్లాడుతాను. ఎందుకంటే మహర్షి అతిపెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. కామెడీ యాంగిల్‌ను చూడకుండా.. సీరియస్ పాత్రను నాకు ఇచ్చిన వంశీ పైడిపల్లి, మహేష్ బాబుకు నా థ్యాంక్స్ అని అల్లరి నరేష్ అన్నారు.

మే 9వ తేదీన రిలీజ్ కానున్న మహర్షి సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన లిరికల్ వీడియోలకు అనూహ్యమైన స్పందన వస్తున్నది. ఈ సూపర్ మూవీకి కె.యు.మోహనన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. హరి, సాల్మన్, సునీల్‌బాబు, కె.ఎల్.ప్రవీణ్, రాజు సుందరం, శ్రీమణి, రామ్-లక్ష్మణ్ పనిచేస్తున్న ముఖ్య సాంకేతికవర్గం. దర్శకత్వం: వంశీ పైడిపల్లి.


Click it and Unblock the Notifications











