మహేష్ మీతో ఆఫర్.. గొప్ప అదృష్టం .. కియారా అద్వానీ
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వైజయంతి మూవీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా బ్యానర్లపై అత్యాధునిక సాంకేతికతతో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం 'మహర్షి'. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. కమెడియన్ హీరో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. ఆటపాటలతో వేదిక హోరెత్తింది. సూపర్‌స్టార్ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడంతో భరత్ అనే నేను హీరోయిన్ కియారా అద్వానీ స్పందించారు. మహేష్‌తో తొలి చిత్రం అనుభవాలను గుర్తు చేసుకొన్నారు. ఆమె ఏమన్నారంటే
మహేష్ సార్ నీకు బెస్ట్ విషెస్. మీ 25వ సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కావాలని కోరుకొంటున్నాను. పూజా హెగ్డేతోపాటు చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు. మీతో భరత్ అనే నేను చిత్రంలో నటించే అవకాశం రావడం నాకు గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. మీ సినిమాను చూడటానికి చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాను అని కియారా అద్వానీ అన్నారు.

మే 9వ తేదీన రిలీజ్ కానున్న మహర్షి సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన లిరికల్ వీడియోలకు అనూహ్యమైన స్పందన వస్తున్నది. ఈ సూపర్ మూవీకి కె.యు.మోహనన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. హరి, సాల్మన్, సునీల్‌బాబు, కె.ఎల్.ప్రవీణ్, రాజు సుందరం, శ్రీమణి, రామ్-లక్ష్మణ్ పనిచేస్తున్న ముఖ్య సాంకేతికవర్గం. దర్శకత్వం: వంశీ పైడిపల్లి.


Click it and Unblock the Notifications











