చిరంజీవి కోసం 100 సార్లు రక్తదానం చేసిన సీనియర్ హీరో.. మెగాస్టార్ ఎమోషనల్

మెగాస్టార్ చిరంజీవి అభిమాని, నటుడు మహర్షి రాఘవ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నాడు. చిరంజీవి బ్లడ్ బ్యాంకులో 100 సార్లు రక్తదానం చేసి ఓ రికార్డును సొంతం చేసుకొన్నాడు. రక్తదానం గొప్పది..ఎంతో మంది ప్రాణాలను కాపాడే గొప్ప కార్యకరం. అలాంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు అభినందనీయం అని ఈ సందర్భంగా నటుడు మహర్షి రాఘవను చిరంజీవి అభినందించారు. ఈ సందర్భంగా నటుడు మురళీమోహన్‌ను కూడా ఆయన ప్రశంసించారు. ఈ వివరాల్లోకి వెళితే..

సమాజానికి తన వంతుగా సేవ చేయాలనే లక్ష్యంతో చిరంజీవి బ్లడ్ బ్యాక్ ప్రారంభమైంది. ఆ సందర్భంగా బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేసిన తొలి వ్యక్తి హీరో మురళీ మోహన్. ఆ తర్వాత రెండో వ్యక్తిగా మహర్షి రాఘవ రక్తదానం చేశారు. అప్పటి నుంచి నేటి వరకు అంటే 26 ఏళ్లుగా రక్తదానం చేస్తూనే ఉన్నారు. తాజాగా తన జీవితంలో 100 సారి రక్తదానం చేసి రికార్డు క్రియేట్ చేశారు.

Maharshi Raghava rare feet by donating blood 100 time for Chiranjeevi Charitable Trust

100 సారి రక్తదానం చేసేటప్పుడు నేను తప్పకుండా వస్తాను అని మహర్షి రాఘవకు చిరంజీవి మాట ఇచ్చారు. అయితే అనుకోని కార్యక్రమాల వల్ల ఆ సమయంలో చిరంజీవి చెన్నైలో ఉండి మాట నిలబెట్టుకోలేకపోయారు. అయితే ఈ ఘనతను సాధించిన మహర్షి రాఘవను తన నివాసానికి పిలిపించి సత్కరించారు. ఈ సమయంలో తొలి రక్తదాత మురళీ మోహన్‌ను ఈ వేడుకలో భాగం చేశారు. మ‌హ‌ర్షి రాఘ‌వ స‌తీమ‌ణి శిల్పా చ‌క్ర‌వ‌ర్తి కూడా స‌న్మాన కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ఈ సందర్బాన్ని పురస్కరించుకొని.. ముందుగా మహర్షి రాఘవ.. మా చిరంజీవి చారిటబుల్ ట్రస్టులోని బ్లడ్ బ్యాంక్‌లో 100వ సారి రక్తదానం చేశారు. ఇప్పటికే చాలా మంది 50, 60 సార్లు రక్తదానం చేసిన వాళ్లు ఉన్నారు. కానీ 100వ సారి మాత్రం చేసింది రాఘవ ఒక్కరే. ఈ సందర్బంగా మా ఇంటికి మనస్పూర్తిగా ఆహ్వానించి ప్రశంసించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తాను అని చిరంజీవి అన్నారు.

Maharshi Raghava rare feet by donating blood 100 time for Chiranjeevi Charitable Trust

మేము తొలిసారి బ్లడ్ బ్యాంక్ పెట్టినప్పుడు మురళీ మోహన్ గారు ఉన్నారు. ఆయన రక్తదానం చేసిన తొలి వ్యక్తి. అదే రోజున మీరు ఇవ్వడం జరిగింది. మీరు క్రమం తప్పకుండా రక్తదానం చేస్తూ అందరికీ స్పూర్తిగా నిలిచారు. ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టడానికి కారణమయ్యారు. అందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను అని చిరంజీవి అన్నారు.

Maharshi Raghava rare feet by donating blood 100 time for Chiranjeevi Charitable Trust

మురళీ మోహన్ మాట్లాడుతూ.. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పెట్టిన రోజున నేను అక్కడ ఉన్నాను. ఆరోజు మహర్షి రాఘవ ఉన్నారు. ఆ రోజున మొదలుపెట్టి ప్రతీ 3 నెలలకు ఒకసారి రక్తదానం చేశారు. 100 సారి రక్తదానం చేసిన వ్యక్తిగా మహర్షి రాఘవ ఘనతను సాధించారు. రక్తదానం చేస్తే ఏదో అవుతుందనే భయం ఉంటుంది. రక్తదానం చేసిన ప్రతీ సారి శరీరంలోకి కొత్త రక్తం వస్తుంది. యువకులు అందరూ రక్తదానం చేయాలని ఆయన ఆకాక్షించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X