విజయనిర్మల మరణం.. మహేష్ నిర్ణయం!

సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల మరణం సినీ, రాజకీయ వర్గాలను తీవ్రంగా కలచివేసింది. బాలనటిగా సినీ ఆరంగేట్రం చేసి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించింది విజయనిర్మల. ఆ తర్వాత దర్శకురాలిగా కూడా సత్తాచాటిన ఆవిడ మృతి చెందడం యావత్ సినీలోకాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ మేరకు సినీ, రాజకీయ ప్రముఖులు ఆవిడ మృతి పట్ల సంతాపం తెలియ జేస్తున్నారు.

మహర్షి 50 రోజుల వేడుక

మహర్షి 50 రోజుల వేడుక

కాగా శుక్రవారం (జూన్ 28) సాయంత్రం మహర్షి 50 రోజుల వేడుక కోసం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికను ముస్తాబు చేస్తున్నారు మహేష్ అండ్ టీమ్. మహర్షి సినిమా విజయవంతంగా తెలుగు రాష్ట్రాల్లోని 200 సెంటర్లలో 50 రోజులు పూర్తిచేసుకున్న సందర్బంగా ఈ వేడుకను ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేశారు.

మహేష్ బాబు నిర్ణయం

మహేష్ బాబు నిర్ణయం

అయితే అకస్మాత్తుగా సూపర్ స్టార్ కృష్ణ భార్య విజయనిర్మల ఈ రోజు (బుధవారం) ఉదయం మృతి చెందడంతో ఈ వేడుకను రద్దు చేయాలని నిర్వాహకులను ఆదేశించారట మహేష్ బాబు. ఇందుకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రముఖుల సంతాపం

ప్రముఖుల సంతాపం

విజయ నిర్మల మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణ, నరేశ్‌ కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ట్వీట్స్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో అల్లరి నరేష్, రానా, శ్రీను వైట్ల, నితిన్, మంచు లక్ష్మి తదితరులు స్పందిస్తూ విజయనిర్మల జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

విజయ నిర్మల అంత్యక్రియలు

విజయ నిర్మల అంత్యక్రియలు

విజయ నిర్మల భౌతికకాయాన్ని ఈ రోజు (జూన్ 27) ఉదయం 11 గంటలకు నానక్‌రామ్‌గూడాలోని ఆమె స్వగృహానికి తీసుకు రానున్నారు. అభిమానులు, సినీ ప్రముఖులు సందర్శనార్థం అక్కడే ఉంచి శుక్రవారం ఉదయం ఫిలింఛాంబర్‌కు తరలించి ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తారు. శుక్రవారం రోజు అనగా జూన్ 28 వ తేదీ మధ్యాహ్నం గానీ, సాయంత్రం గానీ విజయ నిర్మల అంత్యక్రియలు జరుగుతాయని సినీ వర్గాలు పేర్కొన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X