మహర్షి టీజర్ సంచలనం.. ఆ సినిమా అనుకొని పప్పులే కాలేశారు.. దిల్ రాజు
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో 25వ చిత్రంగా వస్తున్న మహర్షి చిత్రం విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేస్తున్నది. ఉగాది రోజున మహర్షి జర్నీ గురించి తెలిపే టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్‌కు వస్తున్న అనూహ్య స్పందన నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి మీడియాతో మాట్లాడారు. వారు ఏమన్నారంటే

ఫ్రెండ్ షిప్ సినిమా అనుకొని
మహర్షి టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తున్నది. గంటల్లోనే 8 మిలియన్ల వ్యూస్‌ను సాధించి ట్రెండ్ సెంటర్‌గా నిలువబోతున్నది. కొద్దిరోజుల క్రితం పాట రిలీజ్ చేసినప్పుడు ఫ్రెండ్ షిప్ సినిమా అనుకొన్నారు. టీజర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. ముందుగా ఫ్రెండ్ షిప్ మూవీ అనుకొన్నాం. కానీ పక్కా కమర్షియల్ సినిమా అనేది అర్థం అవుతున్నది.

అదే సెంటిమెంట్ డేట్
మహర్షి సినిమాను మే 9న రిలీజ్ కాబోతున్నది. ఈ రిలీజ్ డేట్ అశ్వినీదత్‌కు మంచి సెంటిమెంట్. ఆయన రూపొందించిన జగదేకవీరుడు అతిలోక సుందరి, మహానటి చిత్రాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. అలాగే మా బ్యానర్‌లో అదే రోజు రిలీజైన ఆర్య, పరుగు సినిమాలు పెద్ద హిట్టు అయ్యాయి.

తెలుగులో గొప్ప చిత్రంగా నిలిచే
దర్శకుడు వంశీ పైడిపల్లితో ఇది నాకు నాలుగో సినిమా. వంశీకి ఇది ఐదో సినిమా. మూడేళ్లు కష్టపడి స్క్రిప్టు రూపొందించారు. వంశీ కథ చెప్పగానే తెలుగులో గొప్ప చిత్రం అవుతుందని అనుకొన్నాను. అందుకే పీవీపీ, అశ్వినీదత్‌తో కలిసి ఈ సినిమాను రూపొందిస్తున్నాం.

మే 9 తేదీన అద్బుతం చూస్తారు
మేకింగ్ పరంగా, కంటెంట్ పరంగా టీమ్ చాలా కష్టపడి సినిమాను తెరకెక్కించారు. మేము అనుకొన్నట్టే మహర్షి సినిమా తెలుగు ప్రేక్షకులు మే 9న అద్బుతమైన సినిమాను చూడబోతున్నారు. నా జీవితంలో, వంశీ కెరీర్‌లో మంచి చిత్రం అవుతుంది.

8 మిలియన్ల వ్యూస్ రికార్డు
ఉగాది పండుగను పురస్కరించుకొని మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం టీజర్‌ను రిలీజ్ చేయగా సోషల్, యూట్యూబ్ మీడియాలో సెన్సేషనల్‌గా మారింది. గంటల వ్యవధిలోనే ఈ టీజర్ 8 మిలియన్ల వ్యూస్ లభించాయి. ఈ సినిమా టీజర్‌కు వస్తున్న అనూహ్యమైన స్పందనపై వంశీ పైడిపల్లి ఆనందాన్నివ్యక్తం చేశారు. సినిమా టీజర్‌పై వస్తున్న రెస్సాన్స్ థ్యాంక్స్ చెప్పుకోవాలి.


Click it and Unblock the Notifications











