‘మహాసముద్రం’ నుంచి సోల్ వచ్చేసింది: హీరోయిన్ పోస్టర్ వదిలిన చిత్ర యూనిట్
తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్నేళ్లుగా మల్టీస్టారర్ మూవీలు ఎక్కువగా వస్తున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పటి హీరోలు ఇగోలను పక్కన పెట్టడంతో పాటు ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు రావడంతో ఈ తరహా చిత్రాలకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. దీనికి తోడు ఇప్పటి వరకూ అలా వచ్చినవన్నీ హిట్లు అయ్యాయి. తద్వారా దర్శక నిర్మాతలు కూడా అలాంటివి చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం టాలీవుడ్‌లో మరో మల్టీస్టారర్ మూవీ రూపొందుతోంది. అదే.. 'మహాసముద్రం'. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ పోస్టర్ విడుదలైంది.
టాలెంటెడ్ హీరో శర్వానంద్.. లవర్ బాయ్ సిద్దార్థ్ హీరోలుగా 'RX 100' దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న చిత్రమే 'మహాసముద్రం'. ఎమోషనల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా నుంచి హీరోయిన్ అదితి రావు హైదరీ పోస్టర్ కొద్ది సేపటి క్రితమే విడుదలైంది. ఇందులో ఆమె మహా అనే పాత్రను పోషిస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. అంతేకాదు, సముద్రం మధ్యలో ఉండే అమ్మాయి అని.. సినిమాకు సోల్ వంటి పాత్ర అని కూడా తెలిపారు. ఇక, ఇందులో అదితి ఇనోసెంట్‌గా కనిపిస్తోంది. దీంతో ఆమె పాత్ర ఇలాగే ఉండబోతుందని తెలుస్తోంది.

అజయ్ భూపతి డ్రీమ్ ప్రాజెక్టుగా రాబోతున్న 'మహాసముద్రం' షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో అదితి రావ్ హైదరీతో పాటు అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా చేస్తోంది. బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఇందులో స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర దీన్ని నిర్మిస్తున్నారు. 'మహాసముద్రం' చిత్రాన్ని ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.


Click it and Unblock the Notifications











