twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మహాసముద్రం’లో కేజీఎఫ్ గరుడ: భయపెట్టే లుక్‌తో వచ్చిన పవర్‌ఫుల్ విలన్

    |

    తొలి ప్రయత్నంలోనే 'RX100' వంటి సూపర్ డూపర్ హిట్ మూవీని తెరకెక్కించి టాలీవుడ్‌లో సెన్సేషన్ అయ్యాడు యంగ్ డైరెక్టర్ అజయ్ భూపతి. ఇంతటి విజయవంతమైన చిత్రం వచ్చినా.. రెండో సినిమాను మొదలెట్టడానికి చాలా సమయాన్నే తీసుకున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత తన కొత్త చిత్రం 'మహాసముద్రం'ను పట్టాలెక్కించాడు. మల్టీస్టారర్ మూవీగా రాబోతున్న ఇందులో టాలెంటెడ్ హీరోలు శర్వానంద్, సిద్దార్ధ్ కలిసి నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి విలన్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. అది ఎంతగానో ఆకట్టుకుంటోంది.

    డైరెక్టర్ అజయ్ భూపతి డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న చిత్రమే 'మహాసముద్రం'. ఇందులో 'కేజీఎఫ్' వంటి భారీ చిత్రంలో గరుడ అనే భయంకరమైన పాత్రను పోషించిన రామచంద్ర రాజు విలన్‌గా నటిస్తున్నాడు. ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో అతడు ఎంతో పవర్‌ఫుల్ గెటప్‌తో భయపెడుతున్నాడు. అంతేకాదు, ఈ చిత్రంలో ఈ విలన్ ధనుంజయ అనే పాత్రను పోషిస్తున్నాడు. దీంతో ఈ పోస్టర్ చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోయింది.

    Mahasamudram Ramachandra Raju First Look Released

    ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'మహాసముద్రం' చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర దీన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అదితి రావ్‌ హైదరీతో పాటు అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా చేస్తోంది. ఓ పేరున్న హీరోయిన్ ఇందులో స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. సున్నితమైన ప్రేమకథకు భావోద్వేగాలను జోడించి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దీన్ని ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే, కరోనా వల్ల షూటింగ్ ఆలస్యం కావడంతో విడుదల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    English summary
    Sensational Director Ajay Bhupathi Now Doing Mahasamudram Movie with Sharwanand and Siddharth. In This Movie KGF Fame Ramachandra Raju Playing Negative Role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X