Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
‘మహాసముద్రం’లో కేజీఎఫ్ గరుడ: భయపెట్టే లుక్‌తో వచ్చిన పవర్ఫుల్ విలన్
తొలి ప్రయత్నంలోనే 'RX100' వంటి సూపర్ డూపర్ హిట్ మూవీని తెరకెక్కించి టాలీవుడ్లో సెన్సేషన్ అయ్యాడు యంగ్ డైరెక్టర్ అజయ్ భూపతి. ఇంతటి విజయవంతమైన చిత్రం వచ్చినా.. రెండో సినిమాను మొదలెట్టడానికి చాలా సమయాన్నే తీసుకున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత తన కొత్త చిత్రం 'మహాసముద్రం'ను పట్టాలెక్కించాడు. మల్టీస్టారర్ మూవీగా రాబోతున్న ఇందులో టాలెంటెడ్ హీరోలు శర్వానంద్, సిద్దార్ధ్ కలిసి నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి విలన్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. అది ఎంతగానో ఆకట్టుకుంటోంది.
డైరెక్టర్ అజయ్ భూపతి డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న చిత్రమే 'మహాసముద్రం'. ఇందులో 'కేజీఎఫ్' వంటి భారీ చిత్రంలో గరుడ అనే భయంకరమైన పాత్రను పోషించిన రామచంద్ర రాజు విలన్‌గా నటిస్తున్నాడు. ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో అతడు ఎంతో పవర్ఫుల్ గెటప్‌తో భయపెడుతున్నాడు. అంతేకాదు, ఈ చిత్రంలో ఈ విలన్ ధనుంజయ అనే పాత్రను పోషిస్తున్నాడు. దీంతో ఈ పోస్టర్ చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోయింది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'మహాసముద్రం' చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర దీన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అదితి రావ్ హైదరీతో పాటు అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా చేస్తోంది. ఓ పేరున్న హీరోయిన్ ఇందులో స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. సున్నితమైన ప్రేమకథకు భావోద్వేగాలను జోడించి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దీన్ని ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే, కరోనా వల్ల షూటింగ్ ఆలస్యం కావడంతో విడుదల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.