Don't Miss!
- News Arvind kejriwal నేడు కోర్టులో బాంబు పేల్చనున్నారా? సునీతా కేజ్రీవాల్ వ్యాఖ్యలతో ఉత్కంఠ!!
- Sports SRH vs MI: ఆ కుర్రాడి వల్లే ఆల్‌టైమ్ రికార్డు- కమిన్స్
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ తప్పులను నిర్లక్ష్యం చేసిన వారు జీవితంలో ఘోర వైఫల్యాన్ని ఎదుర్కొంటారు...!
- Automobiles కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ బసాల్ట్ విజన్ ఎస్‌యూవీని ఆవిష్కరించిన సిట్రోయెన్
- Technology WhatsApp ద్వారా విదేశాలకు డబ్బు పంపేందుకు కొత్త ఫీచర్! వివరాలు
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
- Finance Hyderabad: తల్లి కోరిక తీర్చిన ఆనంద్ మహీంద్రా.. 4000 మంది విద్యార్థుల కోసం హైదరాబాదులో..
‘మహాసముద్రం’ నుంచి సిద్దార్ధ్ ఫస్ట్ లుక్ రిలీజ్: ఆ రోజులు గుర్తు చేస్తున్న లవర్ బాయ్
తెలుగులో మల్టీస్టారర్ మూవీల హవా కనిపిస్తోంది. అప్పట్లో పెద్దగా ఇలాంటి సినిమాలు రాకపోయినా.. ఈ మధ్య కాలంలో మాత్రం ఎక్కువగా వస్తున్నాయి. దీనికి ప్రేక్షకుల అభిరుచి మారడంతో పాటు హీరోల మధ్య ఇగోలు కనిపించకపోవడమే కారణం అని చెప్పొచ్చు. అందుకే బడా స్టార్ల నుంచి మీడియం రేంజ్ హీరోల వరకూ ఇలాంటి సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. అందుకే ఐదేళ్ల కాలంలోనే పదుల సంఖ్యలో మల్టీస్టారర్ మూవీలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో సినిమా కూడా ఇదే తరహాలో రూపొందుతోంది. అదే 'మహాసముద్రం'.
'RX100' సినిమాతో సత్తా చాటి దర్శకత్వ ప్రతిభను నిరూపించుకున్న అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న తాజా చిత్రమే 'మహాసముద్రం'. ఇందులో టాలెంటెడ్ హీరోలు శర్వానంద్, సిద్దార్ధ్ కలిసి నటిస్తున్నారు. ఎమోషనల్ లవ్ కాన్సెప్టుతో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీని నుంచి ఓ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈరోజు హీరో సిద్ధార్ద్ పుట్టినరోజు. దీనిని పురస్కరించుకుని 'మహాసముద్రం'లో అతడి లుక్‌ను రివీల్ చేశారు. ఇందులో ఈ హీరో ఎంతో యంగ్‌గా కనిపిస్తున్నాడు. తద్వారా పాత రోజులను గుర్తు చేస్తున్నాడు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'మహాసముద్రం' చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అనిల్ సుంకర దీన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అదితి రావ్ హైదరీతో పాటు అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా చేస్తోంది. బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఇందులో స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రేమ కోసం ఇద్దరు వ్యక్తులు చేసే పోరాటంతో ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. దీని షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే కీలకమైన ఎపిసోడ్స్‌ను చిత్రీకరించారు. ఈ సినిమాను ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.
ప్రియాంక చోప్రా.. ఇంతకంటే హాట్ షో మరొకటి ఉండదేమో