ముహూర్తం ఖరారైంది: మహేష్ బాబు లేకుండానే మొదలెట్టేస్తున్నారు!
'మహర్షి'తో భారీ విజయం తన ఖాతాలో వేసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన 26వ చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో కమిటైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మహేష్ తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అయితే సినిమా ప్రారంభోతవ్సంలో మహేష్ బాబు పాల్గొనడం లేదు. ఆయన ప్రస్తుతం తన కుటుంబంతో కలసి యూరఫ్ పర్యటనలో ఉన్నారు. మరో 20 రోజుల తర్వాత ఇండియా తిరిగి వస్తారు. దీంతో మహేష్ లేకుండానే సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగనుంది.

మహేష్ గత చిత్రాలైన 'భరత్ అనే నేను', 'మహర్షి' ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా మహేష్ బాబు లేకుండానే జరిగాయి. ఈ రెండు చిత్రాలు మంచి విజయం సాధించడంతో.... మహేష్ లేకుండానే లాచింగ్ ఈవెంట్ నిర్వహించడం సెటిమెంటుగా మారిపోయింది.
'ఎఫ్ 2' సినిమాతో భారీ విజయం నమోదు చేసిన అనిల్ రావిపూడి తొలిసారి మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్‌తో కలసి పని చేసే అవకాశం దక్కడంతో ఈ ప్రాజెక్టు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే షూటింగుకు సంబంధించి పక్కా ప్లానింగ్ సిద్ధం చేశారు. అనుకున్న బడ్జెట్లో, అనుకున్న సమయానికి సినిమా పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశారట.
ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్. ఇప్పటికే ఇతర సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక... మహేష్ బాబు సినిమా మిస్ చేసుకోకూడదని డేట్స్ అడ్జెస్ట్ చేసి మరీ కేటాయించిందట. టాలీవుడ్లో ఇప్పటికే పలు విజయాలు తన ఖాతాలో వేసుకున్న ఈ కన్నడ బ్యూటీ... మహేష్ బాబుతో మరో హిట్టు కొడితే స్టార్ హీరోయిన్ల జాబితాలో చోటు దక్కించుకోవడం ఖాయం.


Click it and Unblock the Notifications











