అలా రాయకండి.. త్వరలో నిజం చెబుతా .. రంగస్థలం మహేష్ ఎమోషనల్ వీడియో!

'జబర్దస్త్' కామెడీ షోతో ప్రేక్షకులకు పరిచయమైన నటుడు మహేష్. తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు అందుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. శతమానం భవతి, మహానటి, రంగస్థలం, జాతిరత్నాలు, సీతారామం, విరూపాక్ష, లక్కీ భాస్కర్, తండేల్ వంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. ముఖ్యంగా 'రంగస్థలం'లో చిట్టిబాబు స్నేహితుడి పాత్ర ఆయన కెరీర్‌కు పెద్ద మలుపు తీసుకొచ్చింది. 'గుణ 369'లో నెగెటివ్ షేడ్ పాత్రలో కూడా నటించి తనలోని మరో కోణాన్ని చూపించాడు. ఇటీవల విడుదలైన 'సింగ్ గీతం'లో కూడా కనిపించాడు.

Also Read
MIB Day 8 Collections: మళ్లీ పుంజుకున్న 'మా ఇంటి బంగారం' కలెక్షన్లు.. సమంత మూవీకి ఎన్ని కోట్లంటే?
MIB Day 8 Collections: మళ్లీ పుంజుకున్న 'మా ఇంటి బంగారం' కలెక్షన్లు.. సమంత మూవీకి ఎన్ని కోట్లంటే?

అయితే.. మహేష్ ఆచంట తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సినీ వర్గాల్లోనే కాకుండా అభిమానుల్లోనూ తీవ్ర చర్చకు దారి తీసింది. ఇంతకీ ఏమైంది? మహేష్ ఆచంట తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. 'ఎవరి జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. బయట కనిపించే దాన్ని బట్టి కథలు రాసేయడం సరైంది కాదు. ముఖ్యంగా రిపోర్టర్స్, మీమర్స్.. నేను చెప్పేంత వరకు దయచేసి మీ సొంత ఊహలతో ఏదీ రాయకండి. త్వరలో నేనే పూర్తి నిజం చెబుతాను' అని అన్నారు. అయితే ఈ వీడియోకు ఆయన ఎలాంటి క్యాప్షన్, హ్యాష్‌ట్యాగ్ లేదా వివరణ ఇవ్వలేదు. దీంతో ఈ వీడియో వెనుక అసలు ఉద్దేశం ఏమిటనేది కూడా తెలియదు. కానీ, ఈ వీడియో మాత్రం వైరల్ గా మారింది.

Recommended For You
ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు.. సమంత ప్రెగ్నెన్సీపై డైరెక్టర్ రియాక్షన్!
ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు.. సమంత ప్రెగ్నెన్సీపై డైరెక్టర్ రియాక్షన్!
Mahesh Achanta Viral Video Sparks Mystery Personal Issue or Movie Promotion Full Details

ఎలాంటి వివరణ లేకుండా "లైఫ్ చాలా అన్‌ప్రెడిక్టబుల్.. నేను నిజం చెప్పేంత వరకు ఎవరూ ఊహాగానాలు రాయకండి" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అనేక సందేహాలకు కారణమయ్యాయి. ముఖ్యంగా మీడియా, మీమర్స్‌ను ఉద్దేశించి మాట్లాడటం మరింత ఆసక్తిని పెంచింది. గత కొన్ని రోజులుగా మహేష్ ఆచంట పేరు ఎలాంటి వివాదాల్లో వినిపించలేదు. ఆయనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగిన సందర్భాలు కూడా పెద్దగా లేవు. అలాగే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎలాంటి వార్తలు బయటకు రాలేదు. అలాంటి సమయంలో ఒక్కసారిగా ఆయన ఇలా భావోద్వేగంగా స్పందించడం అభిమానులను అయోమయంలోకి నెట్టింది.

You May Also Like
నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే డీఎం చేయండి.. టాలీవుడ్ హీరోయిన్ బంపర్ ఆఫర్!
నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే డీఎం చేయండి.. టాలీవుడ్ హీరోయిన్ బంపర్ ఆఫర్!

దీంతో "ఏమైంది అన్నా?", "ఎలాంటి కష్టం వచ్చింది?", "ఆరోగ్య సమస్య ఏమైనా ఉందా?", "కుటుంబానికి సంబంధించిన విషయమా?" అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొందరు మాత్రం ఇది కచ్చితంగా కొత్త సినిమా లేదా వెబ్‌సిరీస్ ప్రమోషన్‌లో భాగమేనని అభిప్రాయపడుతున్నారు. ఇటీవలి కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి మూవీ ప్రమోషన్ పెరిగిన విషయం తెలిసిందే. మొదట ఎమోషనల్ వీడియోలు లేదా సందేహాలు కలిగించే పోస్టులు పెట్టడం, ఆ తర్వాత అది సినిమా, వెబ్‌సిరీస్ అని వెల్లడించడం తరచూ జరుగుతోంది. ఇదే తరహాలో మహేష్ ఆచంట వీడియో చేసి ఉంటారా? అనే సందేహాలు కూడా వస్తున్నాయి.

Sunitha vs Chinmayi:'మై బాడీ.. మై రైట్' వివాదం.. చిన్మయికి సింగర్ సునీత స్ట్రాంగ్ కౌంటర్!
Sunitha vs Chinmayi:'మై బాడీ.. మై రైట్' వివాదం.. చిన్మయికి సింగర్ సునీత స్ట్రాంగ్ కౌంటర్!

ప్రస్తుతం మహేష్ చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది. అలాంటి సమయంలో వచ్చిన ఈ వీడియో ఆసక్తిని పెంచుతోంది. అయితే ఈ వీడియో వెనుక ఉన్న అసలు కారణం ఏమిటనేది సస్పెన్స్‌గా మారింది. అసలు విషయమేంటో తెలియాలంటే.. మహేష్ స్వయంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.

Read more about: jabardasth tollywood mahesh babu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X