SSMB28: టైటిల్ లాంచ్ పై అఫీషియల్ క్లారిటీ వచ్చేసింది.. బిగ్ స్క్రీన్ పై ఆ రోజే సర్‌ప్రైజ్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇక ఈ మూవీలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే మూవీ రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది.
జూన్ మొదటి వారం నుంచి మూడో షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మూవీలో బాలీవుడ్ వెటరన్ స్టార్ హీరోయిన్ కాజోల్ కీలక పాత్రలో నటిస్తోందనే ప్రచారం వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా త్రివిక్రమ్ శైలికి పూర్తి భిన్నంగా కంప్లీట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారనే ప్రచారం వినిపిస్తోంది.

గతంలో అరవింద సమేత సినిమాని మాస్ స్టొరీగానే ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తీసుకున్న దానికి త్రివిక్రమ్ క్లాస్ టచ్ ఇచ్చాడు. అయితే ఈ సినిమాని మాత్రం పల్నాడు బ్యాక్ డ్రాప్ లో ఊరమాస్ మూవీగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబోలో అతడు, ఖలేజా వచ్చాయి. అయితే బిగ్ స్క్రీన్ పై ఈ రెండు ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు.
కాని ఈ సారి ఎలా అయిన బ్లాక్ బస్టర్ కొట్టాలని త్రివిక్రమ్ ఫిక్స్ అయ్యారు. ఇదిలా ఉంటే ఎస్ఎస్ఎంబి28 సినిమాకి సంబందించిన టైటిల్ పై గత కొద్ది రోజులుగా చాలా కథనాలు వినిపిస్తున్నాయి. కొత్త కొత్త టైటిల్స్ తెరపైకి వచ్చాయి. అయితే వీటిపై ఏది అనేది కన్ఫర్మ్ కాలేదు. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ కృష్ణ జయంతి రోజున మహేష్ బాబు మూవీ టైటిల్ ని రివీల్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసింది.
తాజాగా ట్విట్టర్ లో పోస్టర్ తో మే 31న బిగ్ స్క్రీన్ పై ఎస్ఎస్ఎంబి 28 టైటిల్ ని లాంచ్ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అదే రోజు సూపర్ స్టార్ కృష్ణ మోసగాళ్ళకి మోసగాడు సినిమా రీరిలీజ్ అవుతోంది. ఈ మూవీ రిలీజ్ అయ్యే థియేటర్స్ లో సూపర్ స్టార్, త్రివిక్రమ్ సినిమా టైటిల్ ని లాంచ్ చేయబోతున్నారని తెలుస్తోంది. మరి ఈ టైటిల్ ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











