అందుకే.. ఇటీవలి యూరఫ్ ట్రిప్ గౌతంకు చాలా స్పెషల్: మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి ఇటీవల యూరఫ్ పర్యటనకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఏకంగా 20 రోజుల పాటు లాంగ్ టూర్ వేశారు. ఈ టూర్లో భాగంగా ఇంగ్లండ్‌లో జూన్ 9న జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ కూడా వీక్షించారు.

యూరఫ్ ట్రిప్ అనంతరం ఓ పోర్టర్ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ బాబు తమ హాలిడేకు సంబంధించిన విషయాలు పంచుకున్నారు. రెండు కారణాల వల్ల ఈ ట్రిప్ తనకు, తన కుమారుడికి ఎంతో ప్రత్యేకంగా మారిందని తెలిపారు. 'మహర్షి' సక్సెస్ తర్వాత వెళ్లిన హాలిడే కావడంతో తనకు ఎంతో ప్రత్యేకంగా నిలిచిందని, తన కుమారుడికి ఇది ఫస్ట్ వరల్డ్ కప్ మ్యాచ్ అని తెలిపారు.

Mahesh Babu about his son first World Cup match experience

'మహర్షి' సినిమా షూటింగ్ అనంతరం పారిస్ పర్యటనకు వెళ్లిన మహేష్ తిరిగి వచ్చిన వెంటనే జోరుగా ప్రచారం కార్యక్రమాలు నిర్వహించారు. మూవీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో యూరఫ్‌లో పర్యటించేందుకు మరోసారి లాంగ్ ట్రిప్ ప్లాన్ చేశారు. ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ సమయంలో మహేబాబుతో దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా జాయిన్ అయిన సంగతి తెలిసిందే.

కాగా... ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఇండియా సెమీ ఫైనల్స్‌లోకి ఎంటర్ అయితే మరోసారి తన ఫ్యామిలీతో ట్రిప్ వేసేందుకు మహేష్ బాబు ప్లాన్ చేస్తున్నారట. ఇండియా ఫైనల్ వరకు వెళితే అప్పటి వరకు అక్కడే ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారట.

నేను పిల్లలను చాలా గారాబం చేస్తాను.. అయితే నమ్రత వారి విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుందని మహేష్ తెలిపారు. నేను స్టార్ అయినా మా ఇంట్లో అలాంటి వాతావరణం ఏమీ ఉండదు. సాధారణ ఫ్యామిలీలో పిల్లల మాదిరిగానే మా ఇంట్లోనూ పరిస్థితి ఉంటుందన్నారు.

మహేష్ బాబు తర్వాతి సినిమా 'సరిలేరు నీకెవ్వరు' షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జులైలో ఫ్లోర్ మీదకు వెళ్లనుంది. కమర్షియల్ అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X