శ్రీమంతుడు కంటే పవర్‌ఫుల్ కథ.. మహర్షి అందర్ని టచ్ చేస్తుంది.. మహేష్
మహర్షి సినిమాలో కూడా విలేజ్‌ని దత్తత తీసుకోవడం కంటే కూడా పవర్‌ఫుల్ పాయింట్ ఉంటుంది. దాని గురించి మాట్లాడను. అది మే 9న అందరూ దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఈ సినిమాలో మూడు గెటప్స్ లాక్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ కూడా అందులో ఒకటి. వంశీ ఆ క్యారెక్టర్ పట్ల చాలా క్లియర్‌గా ఉన్నారు. స్టూడెంట్‌కి ఒక లుక్, కంపెనీ సిఇఓగా ఒక లుక్, అలాగే ఊరికి వచ్చినప్పుడు మరో లుక్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఏ లుక్ అయినా క్యారెక్టర్ ప్రకారంగా ఉంటుంది.
ముందు నుంచీ వంశీ చాలా క్లారిటీగా ఉన్నాడు. కథని ఎలా చెప్పాడో అలానే తీశారు. తన క్లారిటీని డైరెక్ట్‌గా కన్వే చేస్తారు. సినిమా చూశాక ముందు వంశీకి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు. సినిమాని అంత ఎక్స్‌ట్రార్డినరీగా తీశారు. ఆయన టీమ్ కూడా స్క్రిప్ట్ మీద చాలా బాగా వర్క్ చేశారు.

భరత్ అనే నేను' సినిమా తర్వాత ఒక నెల మాత్రమే గ్యాప్ మాత్రమే తీసుకున్నాను. ఈ రోజుల్లో సినిమా అనేది చాలా కష్టమైన పనిగా మారింది. నాన్నగారు, వాళ్లందరూ 350, 400 సినిమాలకి హీరోలుగా చేశారు. అయితే ఇప్పుడు 25 సినిమాకే ల్యాండ్‌మార్క్ సినిమా అంటున్నారు. ఒక పెద్ద సినిమా చేయాలంటే మినిమం 8 నుండి 10 నెలలు టైమ్ పడుతుంది. ఒక పర్‌ఫెక్ట్ ప్రొడక్ట్ ఇవ్వాలంటే ఆ టైమ్ అనేది కంపల్సరీ.
టెక్నాలజీ పెరిగింది కదా అని మహేష్ బాబు అన్నారు.


Click it and Unblock the Notifications











