Don't Miss!
- News మహానదిలో పడవ మునక: ఏడుమంది గల్లంతు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
Rocketry Trailer.. మాధవన్‌పై మహేష్ బాబు ప్రశంసలు
శాస్త్రవేత్త అయిన నంబి నారాయణ్ జీవిత చరిత్ర ఆధారంగా మాధవన్ రాకెట్రీ అనే సినిమాను తెరకెక్కించాడు. హీరోగా నటించడమే కాకుండా మొదటి సారిగా కెరీర్లో దర్శకత్వం వహించాడు. కథ, దర్శకత్వం, హీరో ఇలా అన్నీ తానై రాకెట్రీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు రెడీ అయ్యాడు. 1994లో దేశద్రోహిగా ముద్ర పడిన నంబి నారాయణ్ కథను ప్రజలకు చెప్పాలని,అందులోని చీకటి కోణాలను బయట పెట్టాలని మాధవన్ చేసిన ప్రయత్నం అందరినీ మెప్పించాలనే ఉంది.
రాకెట్రి ట్రైలర్ ఆద్యంతం అద్భుతంగా ఉంది. సాంకేతికంగా అప్పుడప్పుడే ఎదుగుతున్న మన దేశంలో అంతరిక్ష వ్యవస్థ గురించి చెప్పాడు. అంతర్జాతీయ స్థాయిలో రాకెట్ సైంటిస్ట్లకు ఉన్న డిమాండ్‌ను మరోసారి చూపించాడు. దేశద్రోహిగా ముద్రవేసి నంబి నారాయణ్‌ను అనుమానించి అవమానించిన తీరును అద్భుతంగా చూపించారు. పిచ్చి అనే ముద్ర వేయడం, దేశద్రోహి అనే ముద్ర వేయడం అనే డైలాగ్‌లు బాగానే ఉన్నాయి.
ఇక చిత్రంలో మాధవన్ నంబి నారాయణ్ పాత్రను పోషిస్తుండగా.. సూర్య ఓ జర్నలిస్ట్ పాత్రను ప్లే చేశాడు. ఈ ఇద్దరి మధ్య జరిగే చర్చే కథలా మారబోతోందిని తెలుస్తోంది. రాకెట్రీ తెలుగు ట్రైలర్‌ను సమంత, మహేష్ బాబు విడుదల చేశారు. ట్రైలర్ అదిరిపోయింది.. సినిమా చూడాలని ఎంతో ఆత్రుతగా ఉంది. ఆల్ ది బెస్ట్ అంటూ మహేష్ బాబు పేర్కొన్నాడు. ఏడాది క్రితమే ఈ ట్రైలర్ చూసిన క్షణంలో కళ్లల్లో నీళ్లు తిరిగాయ్ అంటూ సమంత ఎమోషనల్ అయింది.