మేమంతా ఓ గ్యాంగ్.. మహేష్ ట్వీట్‌కు రష్మిక ఫన్నీ రిప్లై
ఓ వైపు సరిలేరు నీకెవ్వరు ఫీవర్ నడుస్తూ ఉంటే.. మహేష్ బాబు కూతరు సితార, వంశీ పైడిపల్లి కూతురు ఆద్యలతో కలిసి రష్మిక అల్లరి చేస్తోంది. సితార, ఆద్యలు సొంతంగా ఓ యూబ్యూబ్ చానెల్ కూడా మెయింటెన్ చేస్తారన్న సంగతి తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్స్‌లో భాగంగా వీరి చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ క్రమంలో ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

యూ ట్యూబ్ చానెళ్‌తో..
సితార, ఆద్య కలిసి ‘ఏ అండ్ ఎస్' అనే యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశారు. తొలుత త్రీ మార్కర్ ఛాలెంజ్ అంటూ తొలి వీడియో పోస్ట్ చేసిన వీర్దిదరూ.. అనంతరం పలు ఆసక్తికర వీడియోలను పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకున్నారు. అంతేకాకుండా డిఫరెంట్ కంటెంట్ వీడియోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్నారు.

తాజాగా రష్మిక ఇంటర్వ్యూ..
తాజాగా సితార, ఆద్యలు ఇద్దరూ కలిసి రష్మిక మందాన్నను ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలో ‘సరిలేరు నీకెవ్వరు' చిత్ర విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇక మహేష్ సైతం ఈ వీడియోను తన ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ ఈ ముగ్గురి ఎనర్జీ, ఉత్సాహం తనను ఆశ్చర్యపరిచిందని అన్నాడు.

వారితో పాటు నువ్వు కూడా..
‘రాబోయే తరం పిల్లలు.. వారి ఎనర్జీ.. వారి ఉత్సాహం నన్నెప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. రష్మిక నువ్వు కూడా వారితో సమానమే.. మీ ముగ్గురి కలిసి చేసిన ఈ అల్లరి బాగుంది.. రాక్ ఆన్ యూ గర్ల్స్.. 'అంటూ ట్వీట్ చేశాడు.
Recommended Video
ఫన్నీ రిప్లై ఇచ్చిన రష్మిక..
మహేష్ బాబు చేసిన ఈ ట్వీట్‌కు రష్మకి రిప్లై ఇస్తూ.. సర్.. ఇప్పుడైనా ఎప్పుడైనా మేమంతా ఒక్కటే.. గర్ల్స్ గ్యాంగ్ అంటూ క్యూట్‌గా చెప్పుకొచ్చింది. భారీ అంచనాల నడుమ రేపు (జనవరి 11) సరిలేరు నీకెవ్వరు విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











