ఆ చిత్రం ఎప్పటికీ ఆల్ టైమ్ ఫేవరేట్ .. సూపర్ స్టార్ ప్రయాణంపై మహేష్ రియాక్షన్
సూపర్ స్టార్ కృష్ణ సినీ ప్రయాణం తేనె మనసులు చిత్రంతో మొదలైన సంగతి తెలిసిందే. అంతకు ముందు కృష్ణ రెండు మూడు చిత్రాల్లో చిన్న పాత్రలు చేసినా కానీ, తేనెమనసులు చిత్రంతో పూర్తిస్థాయి హీరోగా, సినీ కెరీర్‌లో మొట్టమొదటి విజయాన్ని అందుకున్నాడు. నేటి ఆ చిత్రం విడుదలై 55 ఏళ్లు అవుతోంది. ఈ సందర్బంగా మహేష్ బాబు కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు.

తిరుగులేని ప్రయాణం..
తేనె మనసులు చిత్రంతో కృష్ణ హీరోగా నిలబడితే.. గూఢచారి 116 సినిమా స్టార్ హీరోగా మార్చేసింది. ఈ చిత్రం కృష్ణ పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. అక్కడి నుంచి కృష్ణకు తిరుగులేకుండా పోయింది. యాక్షన్, ఫ్యామిలీ, లవ్ ఇలా అన్ని జానర్లను టచ్ చేసిన కృష్ణ.. ప్రయోగాలు చేయడంలో ముందుండే వాడు.
అన్నింటా ముందే..
సూపర్ స్టార్ కృష్ణను డేరింగ్ అండ్ డాషింగ్ అని అంటారు. ఏదైనా కొత్త టెక్నాలజీని పరిచయం చేయాలన్న, కొత్త మేకింగ్, కొత్త కథలు, క్యారెక్టరైజేషన్ ఇలా ఏదైనా సరే తెలుగు ప్రేక్షకులకు అందించడంలో కృష్ణ ముందున్నాడు. ఫస్ట్ 70 ఎమ్ఎమ్, ఫస్ట్ ఈస్ట్ మన్ కలర్, ఫస్ట్ కౌబాయ్ ఇలా అన్నింటి సూపర్ స్టార్ పేరే ఉంటుంది.
అదే ఎప్పటికీ ఫేవరేట్..
తేనె మనసులు చిత్రం రిలీజై నేటికి 55 ఏళ్లు అవుతుండటంలో మహేష్ బాబు స్పందిస్తూ.. ‘నా ఆల్ టైమ్ ఫేవరేట్ చిత్రం తేనె మనసులు. సమయంతో సంబంధంలేని ఓ క్లాసిక్. 55 ఏళ్ల క్రితం సూపర్ స్టార్ కృష్ణ సినీ ప్రయాణం తేనెమనసులు చిత్రంతో ఈ రోజు ప్రారంభమైంది. బ్లాక్ బస్టర్ బిగినింగ్. మరొక్కసారి ఆ క్షణాల్లోకి వెళ్లి వద్దామ'ని పోస్ట్ చేశాడు.
Recommended Video

లాక్ డౌన్ నేపథ్యంలో మహేష్ పిక్ వైరల్..
లాక్ డౌన్ నేపథ్యంలో సినీ తారలంతా ఇంటి పట్టునే ఉంటున్నారు. ఈ మేరకు సూపర్ స్టార్ మహేష్ బాబు సితారతో ముచ్చట్లు పెట్టిన ఫోటోలు ఆ మధ్య తెగ వైరల్ కాగా.. తాజాగా నమ్రతా మహేష్ బాబు పిక్‌ను షేర్ చేసింది. సామాజిక దూరం పాటించాలి అంటూ మహేష్ దూరంగా కూర్చుని ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోలో మహేష్ మరింత యంగ్‌గా కనిపించడంతో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











