ఆ హీరోయిన్ తో మహేష్ బాబు అఫైర్.. నమ్రత ఏం చేసిందంటే?
సూపర్‌స్టార్ మహేశ్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటశేఖర కృష్ణగారి అబ్బాయిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రిన్స్ అనతికాలంలోనే తండ్రిని మించిన తనయుడిగా నిలిచారు. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా, భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటుల్లో ఒకరిగా , నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఇలా అన్ని రంగాలలో రాణిస్తున్నారు. ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమాలో నటిస్తున్నారు మహేశ్. SSMB 29 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం మహేశ్ బాబు కంప్లీట్ మేకోవర్ అవుతున్నారు.
మహేశ్ బాబు వ్యక్తిత్వం, లైఫ్ స్టైల్‌పైనా ప్రశంసల వర్షం కురుస్తుంది. షూటింగ్‌కి టైమ్‌కి హాజరయ్యే మహేశ్.. ఆ తర్వాత నేరుగా ఇంటికెళ్లి కుటుంబంతో గడుపుతాడు. బయట ఎక్కడా తిరగకుండా ఇంటిలోనే కుటుంబానికే అంకితం కావడం, వీలు కుదిరినప్పుడల్లా భార్యాపిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్లడం మహేశ్ స్టైల్. ఆయన చూపిన బాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు కూడా కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు వారే పలు సందర్భాల్లో తెలిపారు.

తన తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ స్వగ్రామం బుర్రిపాలెంతో పాటు తెలంగాణలోని మరో గ్రామాన్ని దత్తత తీసుకుని వాటి అభివృద్ధికి తోడ్పడుతున్నారు. ఇక గుండె జబ్బులతో బాధపడుతున్న వేలాది మంది చిన్నారులకు ఆపరేషన్లు చేయించి వారి ప్రాణాలను నిలబెట్టి నిజమైన శ్రీమంతుడిగా నిలిచారు మహేశ్ బాబు. సింపుల్‌గా, మీడియాకు దూరంగా ఉండటం మహేశ్‌కు అలవాటు.
ఇక భార్య నమ్రత అంటే మహేశ్ బాబుకు ప్రాణం కంటే ఎక్కువ. వంశీ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడి కొన్నాళ్లు డేటింగ్ చేశారు. అనంతరం పెద్దల అంగీకారంతో ముంబైలో సింపుల్‌గా వీరి వివాహం జరిగింది. మహేశ్‌ను కంప్లీట్‌గా మేకోవర్ చేసిన క్రెడిట్ నమ్రతదే. తనకున్న పీఆర్ బలం, బాలీవుడ్‌లో పరిచయాలతో మహేశ్ వ్యవహారాలను ఆమె చక్కబెడుతున్నారు. మహేశ్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, వ్యాపారాలు తదితర వ్యవహారాలను నమ్రతే పర్యవేక్షిస్తున్నారు. టాలీవుడ్‌లోని స్టార్ కపుల్స్‌లో ఒకరిగా తమ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు మహేశ్ - నమ్రత.

అయితే మహేశ్ కెరీర్ తొలినాళ్లలో పలువురు హీరోయిన్లతో ప్రేమాయణం సాగించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఆయన గురించి తెలిసిన వారెవ్వరూ వాటిని నమ్మలేదు. ఇప్పటికీ ఫిలింనగర్‌లో మహేశ్‌పై గాసిప్స్ వస్తూనే ఉంటాయి. తాజాగా మహేశ్ గురించి సీనియర్ దర్శకుడు గీతా కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహేశ్ - త్రిషల మధ్య ఎఫైర్ నడిచిందని ఆయన బాంబు పేల్చారు.
త్రిషతో మహేష్ ఎఫైర్ నడటవటంతో నమ్రత ఈ బంధాన్ని కట్ చేశారని గీతా కృష్ణ తెలిపారు. మహేశ్‌పై అడుగడుగునా నిఘా ఉంటుందని.. మహేశ్ - త్రిష ముంబైలో ఓ రోజున కలుసుకుంటే ఈ వ్యవహారాన్ని నమ్రత చాకచక్యంగా డీల్ చేశారని గీతా కృష్ణ చెప్పారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











