టాలీవుడ్ నెం 1 స్థానం నిలబెట్టుకున్న మహేష్. ఆ తర్వాత ఎవరంటే.. షాకింగ్‌గా మీడియా సంస్థ సర్వే!

టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో ఎవరు? అనే ఈ ప్రశ్నకు పదేళ్ల క్రితం వరకూ మెగాస్టార్ చిరంజీవి పేరు మాత్రమే వినపడేది. ఆయన తర్వాత స్థానాల్లో బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు పోటీ పడుతుండేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది ఇప్పుడు నెంబర్ వన్ ఎవరు ? అంటే చెప్పడం చాలా కష్టం. నెల నెలా మారిపోతూ ఉంటారు. అందుకే ఎప్పటికప్పుడు తెలుగులో నెంబర్ 1 ఎవరు అనే అంశం మీద పాపులర్ సర్వే కంపెనీ అయిన ఆర్మాక్స్ మీడియా ఎప్పటికప్పుడు సర్వే నిర్వహించి వివరాలు వెల్లడించింది. మే నెలకు గాను టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో మహేష్ బాబు నిలవగా ఆ తరువాత రెండో స్థానంలో అల్లు అర్జున్, మూడో ప్లేస్ లో ప్రభాస్ తమ స్థానాలు నిలబెట్టుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

1-మహేష్ 2-అల్లు అర్జున్

1-మహేష్ 2-అల్లు అర్జున్

ఆర్మాక్స్ మీడియా మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ కేటగిరీలో మహేష్ బాబు మొదటి స్థానం నిలబెట్టుకున్నారు. ఏప్రిల్ నెలలో కూడా ఆయన అదే స్థానంలో నిలవగా ఇప్పుడు అదే స్థానం సాధించాడు. చివరిగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పుడు పరశురాం దర్శకత్వం వహిస్తున్న సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నారు. ఈ కేటగిరీలో అల్లు అర్జున్ రెండో స్థానాన్ని మళ్ళీ నిలబెట్టుకున్నారు. చివరిగా అల వైకుంఠ పురంలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్ ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ఆసక్తి నెలకొంది.

3-ప్రభాస్ 4- పవన్ కళ్యాణ్

3-ప్రభాస్ 4- పవన్ కళ్యాణ్

ఇక ఈ జాబితాలో రెబల్ స్టార్ ప్రభాస్ మూడో స్థానానికి పరిమితం అయ్యారు. గతంలో మూడో స్థానం రాగా ఇప్పుడు కూడా అదే స్థానాన్ని నిలబెట్టుకున్నారు. చివరిగా సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఇప్పుడు రాధేశ్యామ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ జాబితాలో పవన్ నాలుగో స్థానానికి ఎగబాకారు. గతంలో ఐదో స్థానంలో ఉన్న ఆయన ఇప్పుడు నాలుగో స్థానానికి చేరారు. ఈ మధ్యనే వకీల్ సాబ్ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన ప్రస్తుతం వరుస సినిమాలు ఒప్పుకుని బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఒక మలయాళ సినిమా రీమేక్ ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నాయి.

5- ఎన్టీఆర్ 6-రామ్ చరణ్

5- ఎన్టీఆర్ 6-రామ్ చరణ్

ఇక ఈ జాబితాలో ఎన్టీఆర్ 5వ స్థానానికి పరిమితం అయ్యారు. మొన్నటి కంటే ఒక స్థానం కిందకి దిగజారారు ఆయన. చివరిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఆయన రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.ఇక
ఈ జాబితాలో రామ్ చరణ్ ఆరో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. చివరిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా చేస్తున్నారు.

7-నాని 8-విజయ్ దేవరకొండ

7-నాని 8-విజయ్ దేవరకొండ

ఇక నేచురల్ స్టార్ నాని ఈ జాబితాలో ఏడవ స్థాస్థానాన్ని నిలబెట్టుకున్నారు. చివరిగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని ఇప్పుడు టక్ జగదీష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈపాటికి కరోనా సెకండ్ వేవ్ లేకపోతే సినిమా రిలీజ్ అయి ఉండేది. ఇక ఈ జాబితాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఎనిమిదో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. చివరిగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ ఇప్పుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది.

Recommended Video

Ormax 2020 : Premi Viswanath Bags A New Award For Karthika Deepam | Filmibeat Telugu
9-చిరంజీవి 10-రవితేజ

9-చిరంజీవి 10-రవితేజ

ఇక మెగాస్టార్ చిరంజీవి ఈ జాబితాలో తొమ్మిదో స్థానానికి ఎగబాకారు. గతంలో పదో స్థానంలో ఉన్న ఆయన ఇప్పుడు తొమ్మిదో స్థానానికి వచ్చారు. ఇక ఆయన సైరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన ఆచార్య అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మాస్ మహారాజా రవితేజ ఈ జాబితాలో పదో స్థానానికి దిగజారారు. ఈ ఏడాది క్రాక్ సినిమాతో హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి అనే సినిమా చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X