టాలీవుడ్ నెం 1 మహేష్. రెండో స్థానంలో బన్నీ, ఆ తర్వాతే ప్రభాస్.. షాకింగ్‌గా మీడియా సర్వే
టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో ఎవరు? అనే ఈ ప్రశ్నకు పదేళ్ల క్రితం వరకూ మెగాస్టార్ చిరంజీవి పేరు వినపడేది. ఆయన తర్వాత బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ల పేర్లు వినిపించేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది ఇప్పుడు నెంబర్ వన్ ఎవరు ? అంటే చెప్పడం చాలా కష్టం. అందుకే ఎప్పటికప్పుడు తెలుగులో నెంబర్ 1 ఎవరు అనే అంశం మీద పాపులర్ సర్వే కంపెనీ అయిన ఆర్మాక్స్ మీడియా ఎప్పటికప్పుడు సర్వే నిర్వహించి వివరాలు వెల్లడించింది. టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో మహేష్ బాబు అని, ఆ తరువాత రెండో స్థానంలో అల్లు అర్జున్, మూడో ప్లేస్ లో ప్రభాస్ ఉన్నారని పేర్కొంది. ఆ వివరాల్లోకి వెళితే

1-మహేష్ 2-అల్లు అర్జున్
ఆర్మాక్స్ మీడియా మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ కేటగిరీలో మహేష్ బాబు మొదటి స్థానం సంపాదించారు. చివరిగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పుడు సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నారు. పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ కేటగిరీలో అల్లు అర్జున్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. చివరిగా అల వైకుంఠ పురంలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్ ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.

3-ప్రభాస్ 4- ఎన్టీఆర్
ఇక ఈ జాబితాలో రెబల్ స్టార్ ప్రభాస్ మూడో స్థానానికి పరిమితం అయ్యారు. చివరిగా సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఇప్పుడు రాధేశ్యామ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ జాబితాలో ఎన్టీఆర్ నాలుగో స్థానానికి పరిమితం అయ్యారు. చివరిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఆయన రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.

5-పవన్ కళ్యాణ్ 6-రామ్ చరణ్
ఇక ఈ జాబితాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 5వ స్థానానికి పరిమితం అయ్యారు. ఈ మధ్యనే వకీల్ సాబ్ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన ప్రస్తుతం వరుస సినిమాలు ఒప్పుకుని బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఒక మలయాళ సినిమా రీమేక్ ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నాయి. ఈ జాబితాలో రామ్ చరణ్ ఆరో స్థానానికి పరిమితం అయ్యారు.. చివరిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా చేస్తున్నారు. ఎన్టీఆర్ తో కలిసి ఆయన ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.

7-నాని 8-విజయ్ దేవరకొండ
ఇక నేచురల్ స్టార్ నాని ఈ జాబితాలో ఏడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చివరిగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని ఇప్పుడు టక్ జగదీష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈపాటికి కరోనా సెకండ్ వేవ్ లేకపోతే సినిమా రిలీజ్ అయి ఉండేది. ఇక ఈ జాబితాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఎనిమిదో స్థానానికి సరిపెట్టుకున్నాడు. చివరిగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ ఇప్పుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది.

9-రవితేజ 10-చిరంజీవి
మాస్ మహారాజా రవితేజ ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో సరిపెట్టుకున్నారు ఆయన ఈ ఏడాది క్రాక్ సినిమాతో హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి అనే సినిమా చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఈ జాబితాలో పదో స్థానం సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చివరిగా అయిన సైరా సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన ఆచార్య అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











