For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సెంటిమెంట్‌తో కొట్టబోతున్న మహేశ్.. పోటీని తట్టుకునేందుకు వాళ్లను బాగా టార్గెట్ చేశారట.!

  By Manoj
  |

  హ్యాండ్సమ్‌ లుక్‌తో ఎంతో మంది హృదయాలను దోచుకున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు. నటనలోనూ రాణిస్తూ సత్తా చాటుతున్నాడు. సూపర్ హిట్లు వచ్చినప్పుడు పొంగిపోకుండా.. ఫ్లాప్‌లు పలకరించినప్పుడు కృంగిపోకుండా ఉండడం అతడి నైజం. అందుకే మహేశ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోతోంది. ఈ మధ్య వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ క్రమంలోనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సారి సంక్రాంతి బరిలో నిలవబోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మహేశ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. వివరాల్లో వెళితే...

  హ్యాట్రిక్ కోసం సక్సె‌స్‌ఫుల్ డైరెక్టర్‌తో కలిశాడు

  హ్యాట్రిక్ కోసం సక్సె‌స్‌ఫుల్ డైరెక్టర్‌తో కలిశాడు

  మహేశ్ బాబు ‘భరత్ అనే నేను', ‘మహర్షి' వంటి సూపర్ హిట్‌ల తర్వాత చేస్తున్న సినిమానే ‘సరిలేరు నీకెవ్వరు'. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా... విజయశాంతి, బండ్ల గణేష్, హరితేజ సహా పలువురు కీలక పాత్రలు చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

  అది మాత్రం వైవిధ్యంగా ప్లాన్ చేశారు

  అది మాత్రం వైవిధ్యంగా ప్లాన్ చేశారు

  సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేసేసింది. ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా ఈ సినిమా పాటలను ప్రతి సోమవారం విడుదల చేస్తున్నారు. అలాగే, టీజర్, ట్రైలర్ కూడా ప్లాన్ చేశారు. ఇక, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మాత్రం సరికొత్తగా ఆలోచించి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు.

  ఇప్పటి నుంచే సరిలేరు అనిపించుకుంటున్నారు

  ఇప్పటి నుంచే సరిలేరు అనిపించుకుంటున్నారు

  మహేశ్ బాబు తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు' నుంచి విడుదలయ్యే ప్రతి దానికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్ అత్యధిక వ్యూస్ సాధించి రికార్డులు క్రియేట్ చేసింది. అలాగే, దీని నుంచి వస్తున్న పాటలు కూడా ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. దీంతో సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

  సెంటిమెంట్‌తో కొట్టబోతున్న మహేశ్

  సెంటిమెంట్‌తో కొట్టబోతున్న మహేశ్

  సంక్రాంతికి విడుదల అయ్యే సినిమాల్లో ఎక్కువ శాతం కుటుంబ కథా చిత్రాలే విజేతలుగా నిలుస్తూ వస్తున్నాయి. చాలా కాలంగా ఇదే జోనర్ సినిమాలు సత్తా చాటుతున్నాయి. దీంతో ఈ సినిమాలో కూడా ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్ ఆకట్టుకునేలా తయారు చేశాడట దర్శకుడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలు కన్నీళ్లు తెప్పిస్తాయని తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది.

  పోటీని తట్టుకునేందుకు వాళ్లే టార్గెట్

  పోటీని తట్టుకునేందుకు వాళ్లే టార్గెట్

  ఈ సారి సంక్రాంతికి మరో స్టార్ హీరో అల్లు అర్జున్ నటిస్తున్న ‘అల.. వైకుంఠపురములో' సినిమా విడుదల అవుతోంది. ఇది కమర్షియల్ సినిమానే అయినా.. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. దీనికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన సినిమాలన్నీ కుటుంబం మొత్తం చేసేవిగా ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే మహేశ్ సినిమాలో సెంటిమెంట్ సీన్స్ పెట్టారని టాక్.

  English summary
  Tollywood Superstar Mahesh Babu New movie is Sarileru Neekevvaru. This Film Directed by Anil Ravipudi. 'Sarileru Neekevvaru' which translates to nobody can match you, story revolves around an Army Major played by Mahesh Babu. In This Movie Vijayashanti also play key role.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X