మహేశ్ బాబునే బెదరగొట్టిన కూతురు సితార.. వైరల్ అవుతున్న వీడియో

సూపర్ స్టార్ మహేష్ బాబు చివరిగా గుంటూరు కారం చిత్రంతో అలరించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మహేష్ బాబు కూడా ఊర మాస్ లుక్ లో తన అభిమానులు ఫిదా చేశారు. అదిరిపోయే డ్యాన్స్, ఆకట్టుకునే యాక్షన్ స్టంట్స్ తో థియేటర్లలో దుమ్ములేపారు. ఇక ఆ చిత్రాన్ని కంటే ముందే మహేష్ బాబు ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి కాంబినేషన్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు ఎస్ఎస్ఎంబీ 29 వర్క్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటుంది.

అయితే మామూలుగానే జక్కన్న తన సినిమాను పూర్తి చేసేందుకు ఎంత టైం తీసుకుంటారో తెలియని పరిస్థితి. రెండు సంవత్సరాలలో పూర్తి చేస్తానన్న బాహుబలిని ఐదేళ్లు, ఏడాది అనుకున్న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రెండున్నరెండ్లకు పైగా చిత్రీకరించారు. ఇక మహేష్ బాబు తో రాబోతున్న యాక్షన్ అడ్వెంచర్ ఫిలిమ్ కంప్లీట్ చేసేందుకు రాజమౌళి ఎన్నాళ్ళ సమయం తీసుకుంటారో తెలియదు. అయితే మహేష్ బాబును తెరపై చూడాలని అభిమానులకు చాలానే సమయం పడుతుంది. కాగా ఈలోగా మహేష్ బాబు ఫ్యాన్స్ ని ఇలా సర్ప్రైజ్ చేశారు.

Mahesh Babu and Daughter Sitara Ghattamaneni new film

మహేష్ బాబు తన లేటెస్ట్ లుక్ తో ఒక్క కమర్షియల్ యాడ్ ను చేశారు. అది కూడా ఆయన ఒక్కరే కాదు కూతురు సితార తో కలిసి నటించడం విశేషం. రిలయన్స్ కు సంబంధించిన ట్రెండ్స్ బ్రాండ్ ను ప్రమోట్ చేసేందుకు మహేష్ బాబు, తన కూతురు సితార తో కలిసి ఎనర్జిటిక్ యాడ్ ఫిలింలో నటించారు. ఈ ఫిలిం లో మహేష్ బాబు యంగ్ లుక్ తో అదరగొట్టారు. అలాగే ఎస్ఎస్ఎంబీ 29 కోసం రెడీ చేసుకున్న లుక్ ను కూడా ఈ యాడ్ ఫిలింలో రెవిల్ చేశాడు. గడ్డం మీసాలు, లాంగ్ హెయిర్ తో సూపర్ స్టార్ మాస్ లుక్కుకు కొత్త నిర్వచనం ఇచ్చారు.

అంతేకాదు మహేష్ బాబు తో నటించిన తన కూతురు సితార కూడా యాక్టింగ్ తో ఇరగదీసింది. 30 సెకండ్ల పాటు సాగే ఈ యాడ్ ఫిలింలో తండ్రిని డామినేట్ చేసేలా సితార పెర్ఫార్మ్ చేసింది. తన టైమింగ్, డైలాగ్ డెలివరీ, హావ భావాలతో ఆకట్టుకుంది. తండ్రినే బెదరగొట్టేలా తన పెర్ఫామెన్స్ ఇచ్చింది. అయితే మహేష్ బాబు తన కూతురు సితారతో ఫస్ట్ టైం కమర్షియల్ యాడ్స్ లో నటించడం ఆసక్తికరంగా మారింది. మళ్లీ తెరపై ఎప్పుడు కనిపిస్తారో అని మహేష్ బాబు అభిమానులు భావిస్తున్న తరుణంలో ఇలా తన లేటెస్ట్ లుక్ లో సూపర్ స్టార్ యాడ్ ఫిలింలో నటించడం విశేషం.

ప్రస్తుతం మహేష్ బాబు, ఆయన కూతురు సితార కలిసి నటించిన ఈ యాడ్ ఫిలిం నెట్టింట వైరల్ గా మారింది. మహేష్ బాబు లుక్, సితార పర్ఫామెన్స్ అండ్ వాయిస్ కు అభిమానులతో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాగా మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రంలో కూడా కూతురు సితార తండ్రితో కలిసి ఒక సాంగ్లో నటించింది. బిగ్ స్క్రీన్ పై అది ఆమెకు మొదటి పరిచయం. ఇంకా ప్రస్తుతం సితార తన స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుంటూనే.. మరోవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తోంది. వచ్చిన డబ్బుల్లో కొంత భాగం సేవా కార్యక్రమాలకు కూడా ఖర్చు పెడుతూ తాత కృష్ణ, తండ్రి మహేష్ బాబు వలె ప్రశంసలు అందుకుంటుంది.

More from Filmibeat

Read more about: mahesh babu ssmb29
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X