హాలీడే మూడ్ : మహేష్ బాబు అక్కడ.. మంజుల ఘట్టమనేని ఇక్కడ
సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఫ్యామిలీతో గడపడం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా.. ఫ్యామిలీని తీసుకుని అలా విదేశాలకు చెక్కేస్తాడు. కుటుంబంతో కలిసి ప్రపంచ దేశాలను చుట్టేసే మహేష్ బాబు.. ఈ మధ్య తరుచుగా వెకేషన్‌కు వెళ్తున్నాడు. అయితే ఈసారి ఘట్టమనేని ఫ్యామిలీ అంతా చెరో వైపు వెళ్లినట్టు కనిపిస్తోంది. మహేష్ బాబు విదేశాలకు వెళ్తే.. మంజుల ఘట్టమనేని, సుధీర్ బాబు కుటుంబాలన్నీ మంగళూరుకు వెళ్లాయి.
విదేశాల్లో మహేష్ బాబు, గౌతమ్, సితారా చేసే అల్లరిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నమ్రత. ఈ మధ్యే న్యూయార్క్, దుబాయ్ అంటూ తిరిగొచ్చిన మహేష్ ఫ్యామిలీ మళ్లీ విదేశాలకు ఎగిరిపోయింది. విజయ నిర్మల జయంతి సందర్భంగా ఆమె విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమం కోసమే విదేశాల నుంచి తిరిగివచ్చాడని, మళ్లీ అక్కడికే చేరుకున్నాడని తెలుస్తోంది.
View this post on InstagramA post shared by Manjula Ghattamaneni (@manjulaghattamaneni) on

మరో వైపు సుధీర్ బాబు తన భార్య ప్రియదర్శిని ఇద్దరు పిల్లల్ని తీసుకుని మంగళూర్ వెళ్లిపోయాడు. మంజలు ఘట్టమనేని, తన భర్త సంజయ్ ఇంకా మిగతా కుటుంబ సభ్యులంతా కలిసి చిక్ మంగళూర్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక వీరు షేర్ చేసే ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.


Click it and Unblock the Notifications











