ఉమెన్స్ డే స్పెషల్ : నన్ను ప్రతీ రోజూ నడిపించే శక్తి.. నమ్రతా ఎమోషనల్ పోస్ట్
మహిళల గురించి చెప్పడానికి ఒక్క రోజు సరిపోదు.. కానీ ఆ మహిళలను గౌరవించాలని, గుర్తించాలని చెప్పడానికి మాత్ర ఒక రోజంటూ ఉండాలి. అదే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. నేడు (మార్చి 8) ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ తన తల్లిని, చెల్లిని, అక్కని ఇలా తమతో ముడి పడి ఉన్న ప్రతీ ఒక్క మహిళను తలుచుకుంటున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సెలెబ్రిటీలంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
విషెస్ చెప్పిన అఖిల్..
అఖిల్ అక్కినేని తన అమ్మ అమలకు, మహిళలందరికీ ఉమెన్స్ డే విషెల్ చెప్పాడు. ఆడవారు లేకుండా లోకంలో వెలుగు లేదంటూ పోస్ట్ చేశాడు. దీంతో పాటు అమ్మతో దిగిన ఫోటోలను షేర్ చేశాడు.
అజయ్ దేవగణ్ పోస్ట్..
మహిళా దినోత్సవం సందర్భంగా తన జీవితంలోని మహిళలైన తల్లి, చెల్లి, భార్య, టీచర్స్, పిల్లలే బలమని తెలిపాడు. అందరికీ సెల్యూట్ అంటూ పోస్ట్ చేశాడు. భార్య కాజల్, కూతురుతో దిగిన ఫోటోను షేర్ చేశాడు.
మహేష్ జీవితంలో ముగ్గురే..
నా జీవితంలో ఉన్నది ముగ్గురే.. నా ప్రేమకు నిర్వచనం.. వారికి, మహిళందరికీ మరింత శక్తి రావాలి.. మార్పు అనేది చూపిస్తూ ముందుకు కొనసాగుతూనే ఉండండి అంటూ మహిళా దినోత్సవం సందర్భంగా విషెస్ తెలిపాడు. భార్య నమ్రతా, కూతురు సితార, తల్లి ఇందిరా దేవీ ఫోటోలను షేర్ చేశాడు.
Recommended Video


చాలా మిస్ అవుతున్నా..
‘ఆమె నా తల్లి.. ఆమె నా మార్గదర్శకం.. నేనుండానికి ఆమె స్ఫూర్తే కారణం.. నన్ను ప్రతీ రోజూ నడిపించే శక్తి ఆమె.. ఆమెలా నేను శక్తవంతంగా మారటానికి తన ఆశీస్సులే కారణం.. నా ఈ జీవితానికి ఆమె ఒక్కరే నా మహిళ.. ఆమే నేను.. హ్యాపీ ఉమెన్స్ డే మా.. నిన్ను చాలా మిస్ అవుతున్నా' అంటూ అమ్మ ఫోటోను నమ్రత షేర్ చేసింది.


Click it and Unblock the Notifications











